ఇమ్మాన్యుయేల్‌‌ ను ఇన్‌స్టా‌లోనూ బ్లాక్ చేశానంటోన్న జబర్దస్త్ వర్ష. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఇమ్మాన్యుయేల్, వర్ష గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే నని, అంతకు మించి ఏమీ లేదని ఇమ్మాన్యుయేల్, వర్ష పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహ బంధం కూడా బీటలు వారిందని తెలుస్తోంది.

తాజాగా ఇమ్మానుయేల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్నిస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. తాజాగా ఓ టీ వీ షోకు జంటగా హాజరయ్యారు వర్ష, ఇమ్మాన్యుయేల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలామంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకోటి అసలు వద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది. ‘ నా జీవితంలో 2024 లాంటి సంవత్సవరం మళ్లీ ఎప్పటికి చూడకూడదు అనుకుంటున్నా.

ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమ్మానుయేల్‌కి ఒకసారి కాదు.. లెక్క లేనన్ని సార్లు గొడవలు జరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నాం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యన్యంగా కనిపించే ఇమ్మాన్యుయేల్- వర్ష ఎందుకు విడిపోయారు? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా టీవీషోస్ తో ఫుల్ బిజి బిజీగా ఉంటోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *