వనిత విజయ్ కుమార్.. తెలుగులో దేవి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న వనిత కేవలం తన వ్యక్తిగత జీవితం కారణంగా మాత్రమే వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు అయిన వనిత.. కుటుంబ తగాదాల కారణంగా కూడా వార్తల్లో నిలిచారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత విజయ్ కుమార్ ఇప్పుడు ఆ ముగ్గురికి దూరం అయ్యింది. అలాగే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ ఆమె వివాదం పెట్టుకుంది.
వీటితో పాటు చాలా కాంట్రవర్షల్ కామెంట్స్ చేసి పాపులర్ అయ్యింది. తెలుగులో చివరిగా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 2000 సంవత్సరంలో హీరో ఆకాష్‌ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఆనంద్ అనే బిజినెస్ మెన్‌ను రెండో పెళ్లి చేసుకుంది వనిత. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కూడా విడిపోయారు.
ఆతర్వాత పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వరుసగా పెళ్లిళ్లు చేసుకొని అవి పెటాకులు అవ్వడంతో.. ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం సినిమాల పై పెట్టింది. కానీ ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు. అయితే ఇప్పుడు ఆమె నాలుగోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది.ప్రముఖ కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది వనిత విజయ్ కుమార్. ఇతగాడు తమిళ్ బిగ్ బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు.
వారిద్దరూ బీచ్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసిన వనిత అక్టోబర్ 5 సేవ్ ది డేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ పై నెటిజన్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇది సినిమా ప్రమోషన్ అని.. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని. అక్టోబర్ 5న సినిమాను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో తెలియాల్సి ఉంది.