ప్రస్తుత రోజుల్లో సినీ తారలు చాలా వరకు లేటు వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కంటే సినిమా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు కొందరు. ఇక రామ్ చరణ్ మాత్రం సరైన వయసులోనే ఉపాసనను వివాహం చేసుకున్నాడు. అయితే ఉపాసన కామినేని అనగానే మొదట గుర్తొచ్చేది అపోలో హాస్పిటల్. అపోలో భారతదేశపు మొట్టమొదటి హాస్పిటల్ చైన్. ఉపాసన తాతల ఆస్తి 21,000 కోట్లు. వీరంతా వ్యాపార కుటుంబానికి చెందిన వారు. ఉపాసన కుటుంబం అంతా అపోలో హాస్పిటల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఉపాసన కూడా హాస్పిటల్స్‌లో సీనియర్ పదవిలో ఉన్నారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.
ఉపాసన వాళ్ల తాత ప్రతాప్ సి.రెడ్డి అపోలో హాస్పిటల్స్ యజమాని. తండ్రి చైర్మన్, తల్లి శోభన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్. దేశంలోని 100 మంది అతిపెద్ద బిలియనీర్‌లలో ఉపాసన తల్లి దండ్రులు కూడా ఒకరు. ఉపాసన ఇంటర్నెషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రురాలైంది. చదువు పూర్తయిన తర్వాత ఉపాసన కుటుంబ వ్యాపారంలో చేరింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ పదవిలో ఉండటమే కాకుండా, బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కూడా ఉన్నారు. బీమా కంపెనీల గురించి మీకు తెలిస్తే, మీరు TPA పేరు విని ఉంటారు.
ఇది కుటుంబ ఆరోగ్య బీమా కంపెనీ. ఈ కంపెనీకి ఉపాసన మేనేజింగ్ డైరెక్టర్. ఉపాసన తండ్రి కూడా వ్యాపారవేత్త. అతని పేరు అనిల్ కామినేని, అతను KEI గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ బోర్డులో ఉపాసన కూడా ఉన్నారు. ఇక ఉపాసన 2012, జూన్ 14న రామ్ చరణ్‌ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లయిన 11 ఏళ్లు. ఇక ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియా సమాచారం ప్రకారం వ్యాపారంలో చేరడానికి ముందు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నారు.
రామ్ చరణ్ ఆస్తులు దాదాపు రూ.2500 కోట్లు. ఇందులో ఉపాసన రూ.1,370 కోట్ల నికర విలువ. మిగతా ఆస్తులు అన్ని రామ్ చరణ్‌వి. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టారో హీరోలలో ఒకరు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నిన్న విడుదైంది. మిక్స్డ్ టాక్‌తో రూ.150 కోట్ల వరకూ ఉండొచ్చని ఇన్‌సైడ్ టాక్. ఈ మూవీ శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మాములు టాక్‌ల మధ్య నడుస్తోంది.