భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. బంగారం, వెండి ధరలలో కనిపించే ధోరణిని నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 22,24,18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. రేట్లు కొంత సమయంలో SMS ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా, నిరంతర నవీకరణల కోసం మీరు www.ibja.co లేదా ibjarates.comని తనిఖీ చేయవచ్చు.
అయితే దేశంలో పసిడి ఎంతో విలువైన లోహంగా భావిస్తారు. ప్రపంచంలో ఏ లోహానికి లేని వ్యాల్యూ దీనికి ఉంటుంది. భారత దేశంలో మహిళలు తమ ఒంటిపై ఎంతోకొంత బంగారం ఉండాలని కోరుకుంటారు.ప్రస్తుతం ఆషాఢ మాసం సీజన్ మొదలైంది. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు చేస్తుంటారు మహిళలు. మొన్నటి వరకు పసిడి ధరలు చుక్కలు చూపించాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప శుభవార్త.
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి, రూ.68,140 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.74,340 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.74,340 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,290ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 74,490 వద్ద కొనసాగుతుంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,990 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,3400 వద్ద కొనసాగుతుంది. దేశంలో కిలో వెండి పై రూ.100 తగ్గింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.97,650, ఢిల్లీ,ముంబై, కోల్ కొతా లో కిలో వెండి ధర రూ.93,150గా,బెంగుళూరులో రూ.91,650 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర. 97,650 వద్ద కొనసాగుతుంది.