రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి ఎంత ఉందొ తెలుసా..? ఆ ఆస్తి ఎవరికీ వెళ్తుందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇక లేరు. దేశంలో రతన్ టాటా తరువాత వ్యాపారాలు ప్రారంభించిన ఎందరో ప్రముఖుల వద్ద లక్షల కోట్ల లావా దేవీలు చేస్తున్నట్లు చూస్తూ ఉంటాం. కానీ, రతన్ టాటా ఆస్తుల లెక్కలు చూస్తూ ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. అయితే పది రోజుల క్రితం రతన్ టాటా ఈ లోకాన్ని వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. వేల కోట్ల రూపాయల విలువైన సంపదను మిగిల్చారు. అతని షేర్ హోల్డింగ్స్ అన్నీ కలిపితే వ్యక్తిగత సంపద విలువ రూ.7,900 కోట్లు అవుతుంది.

రతన్‌ టాటాకు పెళ్లి కాకపోవడంతో ఆస్తి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. నివేదికల ప్రకారం.. ఆస్తులపై రతన్‌ టాటా ముందుగానే వీలునామా రాసినట్లు తెలిసింది. రతన్ టాటా రాసిన వీలునామాలో ఏమేమి ఉన్నాయనే వివరాలు బహిరంగంగా అందుబాటులో లేవు. ఈ వీలునామాలోని నిబంధనలను అమలు చేసే బాధ్యతను రతన్ టాటా నలుగురు వ్యక్తులకు అప్పగించారు. లాయర్ డారియస్ ఖంబట్టా, అతని సన్నిహిత మిత్రుడు మెహ్లీ మిస్త్రీ, సోదరీమణులు షిరీన్ జీజీభోయ్, డయానా జీజీభొయ్.

ఈ నలుగురికి టాటా వీలునామాను అమలు చేసే బాధ్యత ఉంది. ఈ వీలునామా రాయడంలో రతన్ టాటాకు లాయర్ డారియస్ ఖంబాటా సహకరించినట్లు సమాచారం. రెండు ప్రధాన టాటా ట్రస్ట్‌ల ట్రస్టీలలో ఖంబటా ఒకరు. రతన్ టాటా చాలా విశ్వసించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. అలాగే, మెహ్లీ మిస్త్రీ రతన్ టాటాకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడు. ఆయన చిరకాల మిత్రుడు. 2016లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన సైరస్ మిస్త్రీకి మెహ్లీ మిస్త్రీ మామ కొడుకు. రతన్ టాటా తన సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యతను అప్పగించిన నలుగురు వ్యక్తులలో షిరీన్, డయానా ఉన్నారు.

రతన్ టాటాకు జన్మనిచ్చిన సోనూ టాటా మరో వ్యక్తితో రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ రెండవ వివాహంలో షిరీన్ జేజీబోయ్, డయానా జేజీబోయ్ జన్మించారు. వీరిలో డయానా జెజీభోయ్ వ్యక్తిగతంగా రతన్ టాటా పట్ల మరింత ఆప్యాయతతో ఉంటారని చెబుతారు. రతన్ టాటా వీలునామా వివరాలు అందుబాటులో లేవు. ఈ వీలునామాలో రాసిన ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలి. ఒకవేళ వీలునామా నిర్దిష్ట ఆస్తుల పంపిణీని పేర్కొనకపోతే, అది వ్యక్తిగత చట్టం ప్రకారం పంపిణీ చేయాల్సి ఉంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *