తారకరత్న మరణం తర్వాత వారి కుటుంబంలో తొలి శుభకార్యం జరిగింది. తారకరత్న – అలేఖ్య దంపతుల పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ హైదరాబాద్‌లో బుధవారం ఘనంగా జరిగింది. అయితే నందమూరి తారకరత్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వినగానే కన్నీళ్లు ఉబికి వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ, 39ఏళ్లకే హర్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. తన నటనతో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
తారకరత్న 2001లో ఏకంగా 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2002లో విడుదలైన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ .. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకుని పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమాలను పలకరిస్తుంటారు. అప్పుడప్పుడు కుటుంబ విషయాలను పంచుకుంటారు. ఎక్కువగా పిల్లలకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తుంటారు. తాజాగా అలేఖ్య కుమార్తెకు సంబంధించి ఇన్ స్టా వేదికగా మరో శుభవార్త పంచుకున్నారు.
ఈ రోజు తన పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ జరిగిందంటూ అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రాంగణం వద్ద తండ్రి తారకరత్న ఫోటోలను అందంగా డెకరేట్ చేసి నివాళులు అర్పించి కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నిష్క హాఫ్ సారీలో కుందనపు బొమ్మలా కనిపించింది. వేడుక కోసం ఎంతో అందంగా ముస్తాబైంది. నుదిటిన పాపిడి బొట్టు.. మెడలో బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డానం, చెవులకు పెద్ద బుట్టలు, రెండు చేతులకు గాజులు వేసుకుంది. క్రీమ్ కలర్ చీర మ్యాచింగ్ రవికలో నిష్క ఎంతో అందంగా కనిపిస్తుంది.
నిష్క అచ్చంగా తన తండ్రి తారకరత్న పోలికలతోనే ఉంది. ఈ కార్యక్రమంలో అలేఖ్య రెడ్డి తరుపు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అంతా పాల్గొన్నట్లు తెలుస్తుంది. మాజీ ఎంపీ వైసీపీ నేత, విజయసాయి రెడ్డి సతీసమేతంగా పాల్గొని నిష్కని ఆశీర్వదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిష్మకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అలేఖ్య రెడ్డి కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.