ఇన్నేళ్లు గడుస్తున్నా నాగార్జున – టబుల ఇష్యూపై సందర్భం వచ్చినప్పుడల్లా చర్చ నడుస్తూనే
ఉంటుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబ్‌తో ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చారు కింగ్. టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుందని, మా ఇంటికి ముందున్న ఫ్లాట్ టబుకి తన భార్య అమల దగ్గరుండి కట్టించిందని నాగ్ చెప్పారు. అయితే సామాన్యుల నుంచి సెలబ్రిటీ స్టార్ల వరకూ కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. యంగ్ స్టార్స్ ఎంత మంది వచ్చినా.. నాగార్జునకు ఎంత ఏజ్ బార్ అయినా.. ఆయన రొమాంటిక్ ఇమేజ్ ను మాత్రం ఇలా కొనసాగిస్తున్నారు. ఇక మన్మధుడు నాగార్జున కు ఇండస్టీలో ఎఫైర్ల గోల ఎక్కవగా ఉండేది.
ఆయన నవ మన్మధుడని… ఆయనతో ఏ హీరోయిన్ సినిమా చేసినా.. ప్రేమలో పడిపోవడం ఖాయం అనుకుంటూ ఉండేవారు. మరీ ముఖ్యంగా కింగ్ నాగార్జున, హీరోయిన్ టబుకు మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా.. వీరిద్దిరిపైనే ఎక్కువగా రూమర్లు వినిపించేవి. టబుతో నిన్నే పెళ్ళాడతా, సిసింద్రీ లాంటి సినిమాలు చేశాడు నాగ్. ఈ సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసిన ఎవరైనా వీరిమధ్య ఏదో ఉంది అనుకోకమానరు. ఈ రెండు సినిమాల్లో వీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను అదరగోట్టారు. మరీ ముఖ్యంగా నిన్నెపెళ్ళాడతా సినిమాలో వీరి రొమాన్స్ చూసిన వారు వీరు పక్కాగా పెళ్ళి చేసుకుంటారు అని అనుకున్నారు.

పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా నాగార్జున , టబు అఫైర్ల రూమర్లు ఆగలేదు. టబు నాగ్ కు లింక్ కలుపుతూ.. చాలా వార్తలు హల్ చల్ చేశాయి. ఈ విషయంలో నాగార్జున కూడా ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. టబుతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున, టబుతో తన బంధం గురించి కూడా మాట్లాడారు. హోస్ట్ నుంచి ఓ ప్రశ్న నాగార్జునకు ఎదురయ్యింది. మీకు టబుకు సమ్ థింగ్ అంట కదా.. మీ బంధం పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిందట కదా, అని ప్రశ్న ఎదురవ్వగా.. నాగార్జున నవ్వుకున్నారు. టబుతో నాకు మంచి రిలేషన్ ఉంది.
నాకంటే కూడా మా ఫ్యామిలీతో ఎక్కువగా ఆమెతో అనుబంధం ఉంది అన్నారు. టబు హైదరాబాదీ కావడం.. ఇక్కడే పుట్టి పెరగడంతో నాకు ఎక్కువగా స్నేహం ఉండేది. నేను కూడా హైదరాబాద్ లో పెరగడంతో.. మా మధ్య మంచి ఫ్రెడ్నిష్ ఉండేది అన్నారు నాగార్జున. ఇక టబు బాలీవుడ్ కు వెళ్లిపోవడం. అక్కడ నుంచి పనిమీద ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. నా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కావల్సినవన్నీ అమల దగ్గరుండి చూసుకుంటుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా టబు అందరితోకలిసి భోజనం చేసేది.
అందరితో హ్యాపీగా మాట్లాడి.. తన పని అయిపోయేంత వరకూ మాతోనే ఉండేది. ఆ తరువాత తిరిగి వెళ్లిపోయేది అన్నారు నాగ్. టబుతో నా బంధం ఇదే.. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను తనని పెళ్ళి చేసుకోలేదు కాబట్టి.. ఆమె అసలు పెళ్ళే వద్దని, ఇలా ఉంటోంది అని చాలా పుకార్లు పుట్టించారు. కాని అందులో నిజం లేదు. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని అన్నారు నాగార్జున.