సుమను నమ్మితే నట్టేట ముంచింది, యాంకర్ వల్ల 26 లక్షలు కట్టి నష్టపోయాం..!

divyaamedia@gmail.com
2 Min Read

టాప్ యాంకర్ ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో కూరుకుపోయారు. ఆ వివాదం వివరాల్లోకి వెళితే.. గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భవన నిర్మాణాలను చేపట్టింది. ఈ వెంచర్ కోసం భారీగా ప్రమోషన్స్ చేసి వినియోగదారులను ఆకర్షించారు. దాంతో తమ కష్టార్జితాన్ని, రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ వెంచర్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. అయితే అట్టహాసంగా ప్రమోషన్స్ చేసిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ యాంకర్ సుమను తమ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకొన్నారు. అయితే ఇటీవల సుమ చేసిన ఓ రియల్ ఎస్టేట్ యాడ్ ఆమెకు తిప్పలు తెచ్చిపెట్టింది.

దీని మూలంగా సుమ అనుకోని వివాదంలో ఇరుక్కుంది. రాఖీ ఎవెన్యూస్ అనే కంపెనీ తమ వెంచర్ కి సుమ తో ప్రమోషన్స్ చేయించారు. తక్కువ ధరలకే ఇల్లు అంటూ సుమ ఈ యాడ్స్ లో నటించింది. అంతేకాదు రాజీవ్ కనకాల కూడా సుమతో ఈ ప్రమోషన్స్ లో నటించారు. సుమ చెప్పడంతో చాలా మంది ఆ ఫ్లాట్స్ కోసం డబ్బు కట్టారు. తక్కువ ధరకే ఇల్లు ఇస్తామని మధ్య తరగతి కుటుంబాలకు ఆశ చూపించారు. దాదాపు రూ. 88 కోట్లు కట్టించుకుని ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆ సంస్థ బోర్డ్ ఎత్తేసింది. దీంతో రాఖీ ఎవెన్యూస్ లో డబ్బు కట్టినవారు బాధితులుగా మారారు. తమకు న్యాయం చేయాలి అంటూ ఆ కుటుంబాలు రోడ్డెక్కాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రోడ్డు పై ప్లకార్డులు పట్టుకుని నిరసన చేస్తున్నారు.

బాధితులు మీడియాతో మాట్లాడుతూ .. యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్లే ఆకర్షితులమయ్యాము. పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకే ఫ్లాట్ ఇస్తాము అని అనడంతో భారీగా డబ్బు కట్టి కొనుగోలు చేసాము. అలాగని సుమను తప్పు పట్టడం లేదు. కానీ ఆమె మాటలు నమ్మి మేము ఫ్లాట్స్ కొనుగోలు చేశాము. ఆమె మాకు ఏదైనా న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాము. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాము ఇలా చేయడం సరికాదని వాపోతున్నారు. కాగా రియల్ ఎస్టేట్ మోసాలకు నెలవుగా మారింది. రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్న వారు కూడా కొన్ని సార్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

డబ్బుల కోసం సమంత నేపథ్యం తెలుసుకోకుండా ప్రచారం చేస్తే ఇలాంటి సమస్యలు తప్పవు. సుమ కూడా ఇప్పుడు అలాంటి విమర్శలనే ఎదుర్కొంటుంది. కాగా సుమ ఈ మధ్య టీవీ షోలు తగ్గించారు. ఆమె సుమ అడ్డా పేరుతో ఒక షో మాత్రమే చేస్తున్నారు. సుమ అడ్డా వేదికగా సెలెబ్రిటీలతో గేమ్స్ ఆడిస్తున్నారు. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇటీవల తన కొడుకు రోషన్ కనకాలను హీరోగా పరిచయం చేసింది. బబుల్ గమ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కింది. బబుల్ గమ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అయితే కమర్షియల్ గా ఆడలేదు. రోషన్ కనకాల మరొక చిత్రం ప్రకటించలేదు. రోషన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి చూడాలి ఈసారి రోషన్ ఎలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో..

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *