నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే 1960లో శ్రీశైలం దగ్గర కృష్ణా నదిపై రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభమై 1981లో పూర్తయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు అందిస్తున్న ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. సాగునీరు తాగు నీటితో పాటు విద్యుత్ వెలుగులు అందిస్తున్న ప్రాజెక్టు శ్రీశైలం.
ప్రస్తుతం 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో, 215 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యంతో శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై మహా నగరానికి తాగునీటిని అందిస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు గేట్ల దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. దీనిని ఇరిగేషన్ భాషలో ప్లంజ్ పూల్ అంటారు. 45 మీటర్ల లోతు 270 మీటర్ల వెడల్పు 400 అడుగుల పొడవున ఈ భారీ గొయ్యి విస్తరించింది. 1996లో భారీ వరదల కారణంగా ఈ గొయ్యి ఏర్పడింది. 2009లో రికార్డు స్థాయిలో వచ్చిన వరదలతో గొయ్యి పూర్తిస్థాయిలో విస్తరించింది. 25 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అవ్వడం అప్పట్లో సంచలనం అయింది.
అయితే ప్రాజెక్ట్ డిజైన్‌కు మించి వరద రావడంతో నిపుణులు ఆందోళన చెందారు. అనుకున్నట్లుగానే గొయ్యి భారీ స్థాయిలో విస్తరించింది. పునాదుల వరకు విస్తరిస్తే డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీడబ్ల్యుసీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నివేదికలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఊసనోగ్రఫీ నివేదిక ఆధారంగా తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ తాజాగా తీవ్రమైన హెచ్చరికలు చేశారు.
గొయ్యి పెద్దదిగా విస్తరించిందని ఏ క్షణమైనా డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆయన హెచ్చరించారు. తక్షణమే గొయ్యిని కాంక్రీట్ తో పూడ్చివేయాలని సూచించారు. అనిల్ కుమార్ హెచ్చరికలతో పాటు గతంలో అనేక హెచ్చరికల కారణంగా తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు స్వయంగా పరిశీలించి చూసి వెళ్లారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డ్యామ్ భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.