హీరోయిన్ శ్రీలీలా పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ద్వారా హీరో కంటే ఎక్కువ హీరోయిన్ కి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె యాక్టింగ్ నటన టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో జతకడుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల.
తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. ఈ సినిమతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయనే చెప్పాలి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో నటించే ఆవకాశాన్ని కొట్టేసింది. ఆ సినిమాలో గాజువాక కండెక్టర్ సాంగ్‌తో టాలీవుడ్‌ను ఊపు ఊపేసింది. ఈ సినిమాతో శ్రీ లీలకు మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదనే చెప్పాలి. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరో అయినా మహేష్ బాబు గుంటూరు కారంలో నటించి ఓ రేంజ్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలంత ఈ అమ్మడుతో చేయటానికి ఎగబడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప 1లో ఊ అంటారా పాటకు సమంత డ్యాన్స్ వేసి ఆకట్టుకోగా ఇప్పుడు పుష్ప 2కు స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది శ్రీ లీల. పుష్ప 2 బాక్సాఫీస్ హిట్టు అవ్వడంతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాందించుకుంది శ్రీ లీల. చాలా తక్కువ కాలంలోనే మహేష్ బాబు, బాలకృష్ణ, రవితేజ, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతో కలిసిన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం శ్రీ లీల సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమాతో వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో అడుగు పెడుతుంది శ్రీ లీల. ఈ మూవీకి ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. లవ్ స్టోరిగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ హీరో మాట్లాడిన వ్యాఖ్యలే పుకార్లకు కారణం. ఇప్పటివరకు మూడసార్లు ప్రేమలో పడ్డాను.. మరోసారి ప్రేమలో పడబోతున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతే కాదు.. ఈ ప్రేమ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు హీరో కార్తీక్ ఆర్యన్.