నటి శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో మరణించారు. గుండెపోటు కారణంగా ఆమె మరణించినట్లు నివేదించబడింది. కానీ ఆమె మరణంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇటీవలి ఇంటర్వ్యూలో తన భార్య, నటి శ్రీదేవి మరియు ఆమె విషాద మరణం గురించి మాట్లాడారు. అయితే భారతీయ సినీ పరిశ్రమలో మొదటి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. దేశంలోని ప్రముఖ నటులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె, తన నటనతో కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉంది..
ఇకపోతే శ్రీదేవి దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె స్టే చేసిన హోటల్ లోని బాత్ టబ్ లో పడి మరణించింది. కానీ ఈమె మరణం పై ఇప్పటికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోణీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య మరణం.. విషాదం అంటూ తెలిపారు. బోణీ కపూర్ మాట్లాడుతూ..”శ్రీదేవి ఎప్పుడూ కూడా తన రూపం గురించే ఎక్కువ శ్రద్ధ వహించేది. ఆమె ఆన్ స్క్రీన్ పాత్రల కోసం ఒక నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉండాలని అనుకుంటు ఉండేది.
అందంగా కనిపించడానికి తరచూ ఎన్నో కఠినమైన చర్యలు కూడా తీసుకునేది. ఆ కఠినమైన నియమాలకు మేము కూడా ఆశ్చర్యపోయే వాళ్ళం. ముఖ్యంగా తరచుగా క్రాష్ డైట్ లను పాటించేది. అంతేకాదు తాను అనుకున్న రూపాన్ని పొందడానికి తిండి కూడా తినేది కాదు. అందంగా ఉండాలనే కోరిక అందరిలో ఆందోళన కలిగించేది. కొన్నిసార్లు ఆమె ఆరోగ్యాన్ని కూడా అది ప్రభావితం చేసింది. అయినా సరే శ్రీదేవి తన రూపాన్ని పొందడం కోసం ప్రయత్నాలు విరమించేది కాదు.
నాతో పెళ్లి అయినప్పటి నుంచి శ్రీదేవికి ‘లో బీపీ సమస్య’ ఉండేది. కఠినమైన ఆహార నియమాల కారణంగానే ఇలా ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంది. ఎప్పుడూ తాను తినే కూరల్లో ఉప్పు లేకుండా చూసుకునేది. దీనికి తోడు బయట హోటల్లో తింటే రాత్రి భోజనంలో ఉప్పు లేకుండా ఆహారం తీసుకునేది అదే ఆరోగ్యానికి కీడుగా మారింది.. అందం కోసం ఆమె ప్రాకులాడడం వల్లే ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి మరణించింది” అంటూ బోణీ కపూర్ కామెంట్లు చేశారు.