నటుడిగా అశేష ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు. అగ్ర హీరోగా యమా బిజీగా ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్ సామాజిక బాద్యతను విడవ లేదు. దివిసీమ ఉప్పెన సృష్టించిన పెను విషాదం లో జోలె పట్టి సర్వసం కోల్పోయిన కుటుంబాల కోసం విరాళాలు సేకరించి ఆదుకున్నారు. అయితే ఎన్టీఆర్‌కి బసవతారకమ్మతో 1943లో పెళ్లి జరిగింది. వీరికి 12 మంది సంతానం. వారిలో ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో బాలకృష్ణ, హరికృష్ణ, అలాగే పురందేశ్వరి, భువనేశ్వరి పాపులర్ అయ్యారు.
మిగిలిన వారంతా తెర వెనుకకే పరిమితమయ్యారు. అయితే 1985లో క్యాన్సర్‌తో బసవతారకమ్మ చనిపోయారు. దీంతో ఆమెకి గుర్తుగా, క్యాన్సర్‌తో ఎవరూ చనిపోవద్దని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించారు ఎన్టీఆర్. బసవతారకం చనిపోయిన కొన్నాళ్లకి లక్ష్మీ పార్వతి దగ్గరయ్యారు. ఆమె రైటర్, ప్రొఫేసర్. ఆమె భావాలు, సపోర్ట్ ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇష్టం లేదనే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించారని అంటుంటారు.

లక్ష్మీ పార్వతి రాజకీయంగానూ ఇన్ వాల్వ్ కావడం ఎన్టీఆర్ ఫ్యామిలీకి మింగుడు పడలేదు, ఇతర లీడర్లు కూడా అసంతృప్తిగా ఉన్నారని, ఎన్టీఆర్‌ని సీఎంగా దించడానికి కారణం ఇదే అంటారు. నిజం ఏంటనేది మిస్టరీ. అంతేకాదు ఎన్టీ రామారావు మరణానికి కూడా ఆమెనే కారణం అని హరికృష్ణ చెప్పడం షాకిస్తుంది. ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ అలాంటి భావాన్నే ఆయన వెల్లడించారు. ఆ ఏజ్‌లోనూ ఎన్టీఆర్ స్టెరాయిడ్స్ తీసుకున్నట్టుగా హరికృష్ణ వెల్లడించారు. `అప్పటికే ఆయన ఏజ్ 72, ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయినా అలాంటి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదం, డాక్టర్లు కూడా చెప్పారు.
కానీ ఎన్టీఆర్ స్టెరాయిడ్స్ తీసుకున్నారని హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ క్రమంలో లక్ష్మీ పార్వతి గురించి షాకింగ్ విషయం వెల్లడించారు. ఆ ఏజ్‌లో ఆమె రీకానలైజేషన్ ఆపరేషన్ చేసుకుందట. ఇది పిల్లలు పుట్టడానికి ఆడవాళ్లు చేసుకునే ఆపరేషన్. ఆ ఏజ్‌లో ఆమె రీకానలైజేషన్ ఆపరేషన్ చేసుకోవడం, ఎన్టీఆర్ స్టెరాయిడ్స్ తీసుకోవడం పిల్లలు కనేందుకే అని తెలుస్తుంది. హరికృష్ణ కూడా అదే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఆ స్టెరాయిడ్స్ కారణంగానే ఎన్టీఆర్ మరణించారని, లేదంటే ఆయన వందేళ్లు బతికేవారని వెల్లడించారు హరికృష్ణ.