Spirituality: ధనవంతులు అయ్యే ముందు మీ ఇంట్లో కనిపించే సంకేతాలు ఇవే.
Spirituality: వాస్తు ప్రకారం మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమల గుంపు కనిపిస్తే, వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది మంచి సంకేతం. ముఖ్యంగా ఈ నల్ల చీమలు ఏదైనా చిరుతిండిలో కనిపిస్తే అది ఇంకా మీకు శుభసూచికమే. అయితే ధనవంతులు కావాలని ఎవరికీ అప్పులు లేకుండా మంచి జీవితం గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ధనవంతులు ఎలా అవుతారు ఒకవేళ ధనవంతులు అయ్యేటప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.
Also Read: అరచేతిలో దురదగా ఉంటే, మీకు నిజంగానే డబ్బు వస్తుందా..?
వాస్తు ప్రకారం మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమల గుంపు కనిపిస్తే, వాటిని తరిమికొట్టడానికి అస్సలు ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది మంచి సంకేతంగా బావించాలి. ముఖ్యంగా ఈ నల్ల చీమలు ఏదైనా చిరుతిండిలో కనిపిస్తే అది ఇంకా మీకు శుభసూచికంగా భావించాలని చెబుతున్నారు. ఈ విధంగా మీ ఇంటి దగ్గర నల్ల చీమల గుంపు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందనడానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. అలాగే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా పక్షి గూడు నిర్మిస్తే అది వాస్తు ప్రకారం శుభప్రదంగా భావించాలట.
అలాగే ఇంట్లో ఏదైనా చిన్న పక్షి కానీ పిచ్చుక కానీ పావురం కానీ గూడు కట్టుకుంటే త్వరలో ఇంటికి లక్ష్మీదేవి రాకని సూచిస్తుందని అర్థం అంటున్నారు పండితులు. చాలామంది ఇలా పిచ్చుకలు గూడు కట్టుకున్నప్పుడు వెంటనే వా టిని తీసి పారేస్తూ ఉంటారు. కానీ ఇక మీదట అలా అస్సలు చేయకండి. కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే చెవుల్లో శంఖం ఊదుతున్న శబ్దం వినపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా చెవిలో శంఖం ఊదుతున్నట్టు శబ్దం వినిపిస్తే అది శుభ సూచకంగా భావించాలని చెబుతున్నారు.
Also Read: చర్మ వ్యాధులను మాయం చేసే బావి. ఈ నీళ్లు అమృతంతో సమానం..!
ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంట్లో పూజలు చేస్తే మీకు ఇంకా మేలు జరుగుతుందట. అయితే ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటకు విసిరేయడం, ఇంటి ముందు పక్షుల గూడులు తొలగించడం లాంటి పనులు పొరపాటున కూడా చెయ్యకండి ఎందుకంటే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరైమీరే బయటకు పంపించినట్లు అవుతుందని చెబుతున్నారు.