కర్ణాటకకు చెందిన సౌందర్య 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె మరణం సినీ పరిశ్రమతోపాటు యావత్ దక్షిణాది ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. భౌతికంగా ఆమె దూరమైనా సౌందర్య ఆనవాళ్లు తెలుగు ప్రజల నుంచి చెరిగిపోలేదు. సినిమాల ద్వారా ఆమె ప్రజల మధ్యనే ఉన్నారు. అయితే సావిత్రి తరువాత తెలుగు పరిశ్రమకు దొరికిన ఆణిముత్యంలాంటి హీరోయిన్ సౌందర్య. హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్నఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.
దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆమె నటించింది. తెలుగులో ఆమెను సావిత్రిలానే ఆదరించేవారు. ఏమాత్రం ఎక్స పోజింగ్ లేకుండా.. వల్గర్ గా డ్రెస్ లు వేసుకోకుండా చాలా పద్దతిగా ఉంటూ స్టార్ డమ్ అందుకున్న ఏకైక హీరోయిన సౌందర్య. నాలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆమె కోట్లకు కోట్లు ఆస్తులు కూడా కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే ఆమె అప్పటికే కోట్లకు కోట్లు సంపాదించగా.. సౌందర్య ఆస్తిని ఆమె భర్త తీసుకుని.. రెండో పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తోంది.
అంతే కాదు అతనిపై లీగర్ లో కేసు వేసి..సౌందర్య తల్లీ తండ్రులు ఆస్తిని మళ్లీ దక్కించుకున్నట్టు సమాచారం. ఇక సౌందర్య ఆస్తిలో భాగంగా..హైదరాబాద్ లోని శంషాబాద్ ఏరియాలో 6 ఎకరాల వరకూ కొన్నిందట సౌందర్య. వాటిని తన తల్లీ తండ్రుల పేరు మీద రాసిందట. అయితే ఇప్పుడు ఆ ఆస్తి కోట్ల విలువ చేస్తుంది. వందల కోట్లు ఉంటుంది. అయితే ఆశ్చర్య కరంగా ఆ ఆస్తి ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహాన్ బాబు చేతుల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదేలా సాధ్యం అని అనుమానం రావచ్చు.
అసలేం జరిగిందంటే..ఝ సౌందర్య మరణం తరువాత ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన ఆమె తల్లీ తండ్రులు ఇక్కడ ఉన్న భూమిని అమ్మారట. ఆ భూమిని మోహాన్ బాబు కొనుక్కున్నట్టు తెలుస్తోంది. ఆ ప్లేస్ లో భారీ స్థాయిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు. మంచు టౌన్ షిప్ పేరుతో నిర్మించిన ఆ ఇంట్లోనే ఆయన ఉంటున్నారు. అయితే ఈ ప్లేస్ ను నిజంగా సౌందర్య ఫ్యామిలీ దగ్గర నుంచి ఆయన కొన్నారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు కాని..ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ మాత్రం నడుస్తోంది.