సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. అయితే సానియా 14 ఏళ్ల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. క్రీడా ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ సెలబ్రిటీ కపుల్ మ్యారేజ్ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు. కొన్నేళ్ల క్రితం ఈ జంట విడిపోయింది. షోయబ్ మాలిక్ మరో మహిళతో ప్రేమలో ఉన్నాడని సానియాకు తెలసిందని, అందుకే విడాకుల కోసం డిమాండ్ చేసిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ దంపతులకు ఒక మగ బిడ్డ కూడా జన్మించాడు. మొత్తానికి వీరి విడాకుల వార్త అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.
ఈ కష్ట సమయంలో చాలా మంది సానియాకు మద్దతుగా నిలిచారు. విడిపోయిన తరువాత కొంత కాలానికి షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల నుంచి సానియా గురించి డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి. ఆమె త్వరలో తెలుగు హీరోను పెళ్లి చేసుకోనుందని కొత్తగా పుకార్లు వినిపిస్తున్నాయి. షోయబ్ మాలిక్ వేరే దారి.. సానియాతో విడాకుల తర్వాత, షోయబ్ మాలిక్ పాపులర్ పాకిస్థానీ యాక్ట్రెస్ సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. వెడ్డింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతకు ముందు వీరిద్దరూ కొంతకాలం డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత సనాకు షోయబ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఆ రూమర్స్ మరింత బలపడ్డాయి. సనా జావేద్‌కి కూడా ఇది రెండో పెళ్లి. ఆమె 2020 అక్టోబర్‌లో పాకిస్థానీ యాక్టర్, సింగర్ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకొని, తర్వాత విడిపోయింది. త్వరలో సానియా రెండో పెళ్లి? విడాకులు తీసుకున్నప్పటి నుంచి సానియా మీర్జా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఇటీవల పాకిస్థాన్ యాక్టర్ నబీల్ జాఫర్, ఒక న్యూస్ ప్రోగ్రామ్‌లో సానియా భవిష్యత్తుపై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. ‘విడాకులు అంటే జీవితం ఆగిపోయిందని కాదు. ఇది దురదృష్టకర సంఘటన అయినప్పటికీ, ఆ తర్వాత ఎవరి జీవితమూ చీకటిమయం కాకూడదు. సానియాకు మంచి జోడీ దొరికితే కచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకోవాలి. షోయబ్ ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్నాడు.’ అని చెప్పాడు.
అతని ప్రకటన వైరల్‌గా మారింది. ఆన్లైన్లో ఆసక్తికర చర్చలకు తెరతీసింది. కొత్త రిలేషన్‌పై పుకార్లు.. సానియా మీర్జా తెలుగు సూపర్ స్టార్‌తో డేటింగ్ చేస్తోందని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. నటుడి పేరు వెల్లడించనప్పటికీ, చాలా మంది అభిమానులు ఈ రిలేషన్ పెళ్లికి దారితీస్తుందని నమ్ముతున్నారు. సోషల్ మీడియా యూజర్లు చాలా మంది ఎవరా హీరో? అని ఆరా తీస్తున్నారు. సానియా మీర్జా ఇంకా ఈ పుకార్లపై స్పందించలేదు. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పలేదు. ఇంతకు ముందు ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమితో సానియా పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ పుకార్లేనని ఆ తర్వాత తేలిపోయింది.