సాధారణంగా అలాంటి కార్యక్రమాలు నాలుగు గోడల మధ్య జరిగేది.కానీ., మారుతున్న కాలం కొద్ది ప్రజలు కొత్త పుంతలు తొక్కుతూ అనేక వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా. ఒక యువ జంట వారి శోభన రాత్రి వినుత రీతిలో జరుపుకోవాలని ఆశించారు. ఆ ఆలోచనకు రూపమే ఈ ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్ అన్నట్టు. అయితే సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా సార్లు కొందరికీ సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. కొన్నిసార్లు వ్యక్తులు స్వయంగా వీడియోను పంచుకుంటారు.
అయితే, ఈ సమయంలో ప్రజలు తమ గోప్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో కొత్త జంట కనిపించింది, వారు తమ హనీమూన్ జరుపుకోవడానికి ఎక్కడికో చేరుకున్నారు. లైక్‌ల కోసం, ఫేమస్ కావడం కోసం సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు జనాలు ఈ జంట హనీమూన్ వీడియోను చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీని తర్వాత ఏం జరుగుతందనేది కూడా షేర్ చేస్తారా అని కొందరు చిలిపి కామెంట్లు కూడా చేస్తున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో కొత్తగా పెళ్లైన జంట కూర్చొని ఉంది. అలాగే, వారు ఉన్న గదికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆది వీరి ఫస్ట్ నైట్‌కు సంబంధించిన వీడియో అని అర్థమవుతుంది. గదిలో పూలతో అందంగా అలంకరించిన మంచంతో పాటు.. పండ్లు కూడా కనిపిస్తాయి. టేబుల్‌పై కేక్ తోపాటు ఖరీదైన షాంపైన్‌ను కూడా ఉంచడం కూడా వీడియోలో చూడవచ్చు. వీటన్నింటిని క్యాప్చర్ చేస్తూ ఆ జంట సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది.
వీరిద్దరు కేక్ కట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు చాలా సరదా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ మీరు తదుపరి సన్నివేశాన్ని కూడా చూపిస్తారా? అంటూ కామెంట్ చేశాడు. కొందరు ఇలాంటి ప్రైవేట్ వీడియోలను నెట్టింట షేర్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఘాటైన కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రైవేట్ మూమెంట్స్ ని మొబైల్ ఫోన్ లో బంధించకుండా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించాలి.