Sobhita Dhulipala: నాగచైతన్యతో నిశ్చితార్ధం తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న శోభిత.
Sobhita Dhulipala: చాలా మంది స్టార్ హీరోయిన్స్ తమ కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న లుక్స్ తో ఎవరూ కొనసాగలేదు. మధ్యలో కొన్ని మార్పులు చేయించుకొని ఇండస్ట్రీలో మరింత ఆదరణ తెచ్చుకునే ప్రయత్నం చేసారు. కాగా శోభిత కూడా ఇలానే చేసింది అని చెప్పాలి. ఆమెవి కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే శోభిత ధూళిపాల.. ఇప్పుడు జస్ట్ ఓ హీరోయిన్ పేరు మాత్రమే కాదు.. అంతకు మించి. అక్కినేని ఫ్యామిలీకి కాబోయే పెద్ద కోడలు శోభిత.. జీవిత కాల ప్రేమ, సంతోషాలకు నాంది పలుకుతూ ఇటీవల నిశ్చితార్ధ వేడుక జరుపుకున్నారు నాగచైతన్య – శోభిత ధూళిపాల.
Also Read: హీరో అక్కినేని నాగచైతన్యకు కాబోయే భార్య ఎన్ని కోట్లకు వారసురలో తెలుసా..?
ఈ వేడుక జరిగాక ఒక్కసారిగా శోభిత పేరు నేషనల్ లెవల్లో మారుమోగుతోంది. ఐఎండీబీ పాపులర్ సెలబ్రిటీల లిస్టులో శోభిత పేరు టాప్ 2లో ఉంది. ఇన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఈ లేడీ ఉన్నపళాన నేషనల్ లెవల్ ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. నిశ్చితార్థ వేడుక తర్వాత అక్కినేని నాగచైతన్యతో కలిసి యమాగా ట్రెండ్ అయ్యారు ఈ బ్యూటీ. ఎంగేజ్మెంట్ ఫొటోలు నాన్‌స్టాప్‌గా ట్రెండింగ్‌లోనే ఉండటం కూడా ఈ ఫేమ్కి కలిసొచ్చింది. నాగచైతన్య తో శోభిత ప్రేమలో ఉన్నారనే విషయం రెండేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఆ విషయాన్ని నిజం చేస్తూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థవేడుక జరుపుకున్నారు ఈ జంట.
Also Read: అవునా..! నాగచైతన్య- శోభిత జంట మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో చేస్తున్నారు. ఇంకో సినిమాకు సైన్ చేశారు. మరోవైపు ధూత సీజన్ 2 కూడా ఉంది. మరి శోభిత ఏం చేస్తున్నారు? అని ఆరాతీస్తే, ఆమె ఫిల్మోగ్రఫీలో ఫ్యూచర్ ప్రాజెక్టులు లిస్టు పెద్దగా ఏమీ కనిపించడం లేదు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేసి మెప్పించారు శోభిత ధూళిపాల. ఓటీటీల్లోనూ ఆమెకు క్రేజ్ ఉంది. ఇటీవల హాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్ చేశారు. అమెరికన్ ఫిల్మ్ మంకీ మ్యాన్‌లో ఆమె చేసిన సీత కేరక్టర్ మెప్పించింది. ప్యాన్ ఇండియా రేంజ్లో మంచి పెర్ఫార్మర్గా పేరున్న శోభిత ఒక్కసారిగా ఎంగేజ్మెంట్తో ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఈ ట్రెండింగ్ ఫేమ్ ఆమె కెరీర్‌కి కూడా ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్.