పెళ్లి అయిన తర్వాత నాలుగోరోజు రాత్రి సాధారణంగా వెడ్డింగ్ నైట్ నిర్వహిస్తారు. ఈ వెడ్డింగ్ నైట్ చాలా సంప్రదయాలు కలిగి ఉంటుంది. పడకగదిని రకరకాల పూలతో అందంగా అలంకరిస్తారు. అగరబత్తీలు, స్వీట్స్, పండ్లు పెట్టి.. బెడ్ రూమ్ ని చాలా ఆకర్షణీయంగా, సువాసనాబరితంగా అలంకరించడం ఆనవాయితీ. అయితే ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.
ఫస్ట్ నైట్ రోజున వధువు ఏకంగా గంజాయి, బీరు కావాలని అడగడంతో వరుడు దెబ్బకు బిత్తరపోయాడు. దెబ్బకు తన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నాడు. అలాగే వధువు అడిగిన కోరికలు.. వరుడు తన కుటుంబసభ్యులకు చెప్పడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులకు సమాచారం అందించడంతో.. జంటకు కౌన్సిలింగ్ ఇవ్వగా..
వరుడు మాత్రం ఈ పెళ్లి ససేమిరా వద్దని తేల్చి చెప్పేశాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఒకటికి రెండుసార్లు ఆ వరుడిని తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరగా.. ఇలాంటి పద్దతులను అతడు ఒప్పుకునే ఆలోచనలో లేడని తేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.