వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయం. కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారం. నమ్మకాలు విశ్వాసాలకు అద్దం పడుతున్న అతి పురాతన ఆలయం. అయితే అది శాతవాహనుల కాలం నాటి అతిపురాతన ఆలయం. కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగుబంగారంగా విలసిల్లుతున్న పురాతన క్షేత్రం. వందల ఏళ్ల చరిత్ర ఈ ఆలయ సొంతం. భక్తుల నమ్మకాలు, విశ్వాసాలకు అద్దం పడుతున్న అతి పురాతన ఆలయం. అదే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం లోని సదల్ పూర్ గ్రామ శివారులో ఉన్న మహాదేవ్, భైరందేవ్ ఆలయం. ఈ ఆలయంలో స్వయంభూగా వెలసిన శివలింగం, పక్కనే గిరిజనుల ఆరాధ్య దైవం భైరందేవ్ ఆలయం ఉన్నాయి.
11వ శతాబ్దంలో నల్లని రాతితో వీటిని నిర్మించినట్లు పూర్వీకులు చెబుతారు. అయితే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో నవమికి ఇక్కడ కొరంగే వంశీయులు చేసే ప్రత్యేక పూజలు, అభిషేకాలతో జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇది ఈ ప్రాంతంలో జంగీ జాతరగా ప్రసిద్ది చెందింది.ఈ జాతర వారం రోజులపాటు కొనసాగుతుంది. ఈ జాతరకు ఆదివాసి గిరిజనులే కాకుండా ఇతర భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఏదైనా కోరిక కోరుకొని భైరం దేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఎత్తితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. రోగాలు కూడా నయమవుతాయని వారి నమ్మకం.

కాగా ఈ మహాదేవ్, భైరందేవ్ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం చిన్నదిగా ఉన్నప్పటికి ఇక్కడ ఉన్న శిల్పాలు మాత్రం ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఎన్నో ఏళ్ల నాటి విగ్రహాలు. భైరం దేవ్ తో పాటు పక్కన రుషిముని, నాగ స్వరూప విగ్రహాలు ఉన్నాయి.పుష్యమాసంలోనే కాకుండా శివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలోని భైరందేవ్, మహాదేవ్ లను దర్శించుకునేందుకు తెలంగాణ జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.
ఈ జాతరకు ఆదివాసి గిరిజనులే కాకుండా ఇతర భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఏదైనా కోరిక కోరుకొని భైరం దేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఎత్తితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. రోగాలు కూడా నయమవుతాయని వారి నమ్మకం. కాగా ఈ మహాదేవ్, భైరందేవ్ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం చిన్నదిగా ఉన్నప్పటికి ఇక్కడ ఉన్న శిల్పాలు మాత్రం ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఎన్నో ఏళ్ల నాటి విగ్రహాలు. భైరం దేవ్ తో పాటు పక్కన రుషిముని, నాగ స్వరూప విగ్రహాలు ఉన్నాయి.