నారా రోహిత్.. చాలా సినిమాల్లో తన నటనతో మంచి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. నారా రోహిత్ లో మేజర్ ప్లస్ పాయింట్ తన వాయిస్. అలా తన వాయిస్ తో, నటనతో మంచి నటుడిగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు నారా రోహిత్. ఇప్పటికీ నారా రోహిత్ నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కచ్చితంగా ఓ కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతలా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక ఇదిలా ఉంటే నారా రోహిత్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.
అయితే ఇక నారా రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రతినిధి-2 హీరోయిన్ సిరి లెల్లాతో ప్రేమలో పడిన ఆయన పెద్దలను ఒప్పించి అక్టోబర్ 13న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక చాలా అట్టహాసంగా జరగ్గా.. దీనికి పలువురు రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ హాజరై సందడి చేశారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, నారా రోహిత్, సిరి ఏజ్ గ్యాప్ గురించి నెటిజన్లు నెట్టింట చర్చలు జరిపారు. దీంతో సిరి బ్యాక్ గ్రౌండ్ కూడా బయటకు వచ్చింది. అయితే రోహిత్ ఏజ్ 40 ఉండగా, సిరి వయస్సు 28.. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారు కొందరు ఆశ్చర్యపోతున్నారు.
ఇక సిరి విషయానికొస్తే.. మాచర్లకు చెందిన ఆమె అయినప్పటికీ హైదరాబాద్‌లో డిగ్రీ వరకు చదువుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత మాస్టర్స్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ వైపు చదువుకుంటూనే షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో పాటు పలు వీడియోలు కూడా చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ప్రతినిధి-2 డిషన్స్‌కు వెళ్లి హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.