గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా వివాహం చేసుకుంది. అర్మాన్ మాలిక్ తన సోషల్ మీడియాలో అధికారికంగా వీరి పెళ్లి ఫొటోలు షేర్ చేసారు. బాలీవుడ్ లో స్టార్ సింగర్ అయిన అర్మాన్ మాలిక్ తెలుగులో కూడా ఆల్మోస్ట్ ఓ 100 పాటల వరకు పాడాడు. అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్ పాడింది ఇతనే.
అదే కాకుండా అనేక సూపర్ హిట్ సినిమాల్లో చాలా సాంగ్స్ పాడాడు. అయితే ఆరేళ్లుగా ప్రేమలో మునిగిన అర్మాన్-ఆష్న జంట 2023లో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థం జరిగిన రెండు సంవత్సరాల తరువాత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఫోటోలు చూసిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ, “మేము ఎంతకాలం ఎదురుచూశామో.. కంగ్రాట్స్!” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
అర్మాన్ మాలిక్ తెలుగులో ఎన్నో పాటలు పాడాడు. ‘హలో’ చిత్రంలోని హలో పాటను, “తొలి ప్రేమ” చిత్రంలోని నిన్నిలా నిన్నిలా, “అల వైకుంఠపురములో” చిత్రంలోని బుట్ట బొమ్మ, “మేజర్” చిత్రంలోని ఓ ఇషా పాటలతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. కచ్చాలింబో అనే హిందీ చిత్రంలో అతిథి పాత్రలో కూడా మెరిశాడు. అర్మాన్ మాలిక్ తల్లి జ్యోతి తెలుగువారే. అర్మాన్-ఆష్న కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.