మెగా స్టార్ జై చిరంజీవ సినిమా కంటే ముందుగానే ఈ అమ్మాయ్ సూర్య, జ్యోతిక కూతురుగా నువ్వు నేను ప్రేమ సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. కొన్నేళ్ల తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమాలో సమంత చెల్లిగా ప్రత్యేక్షం అయ్యింది. ఆతర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలతో కొంతకాలం దుమ్ములేపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె పేరు శ్రియ శర్మ. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. నువ్వు నేను ప్రేమ సినిమాలో సూర్య, జ్యోతిక కూతురిగా కనిపించింది.
అలాగే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఆ మధ్య శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించింది. అలాగే గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకాదు. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు నెటిజన్స్. దాంతో ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో .. చూస్తే అవాక్ అవ్వాల్సిందే. హీరోయిన్స్ ను మించిన అందంతో వయ్యారంతో ఆకట్టుకుంటుంది శ్రియ శర్మ. హిమాచల్ ప్రదేశ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని తండ్రి ఇంజనీర్ కాగా.. ఆమె తల్లి డైటీషియన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. సినిమాల కంటే ఆమె లాయర్ వృత్తిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. బుల్లి గౌనులో అందాలతో ఆకట్టుకుంది శ్రియ.