సాట్నా టైటస్.. 1991 నవంబర్ 28న కేరళలోని కొచ్చిలో జన్మించింది. గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. పిచ్చైక్కారన్ (తెలుగులో బిచ్చగాడు) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సాట్నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ మూవీ అనంతరం పలు చిత్రాల్లో నటించిన ఆమె.. పలు వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది.
అయితే ఈ సినిమాతో దక్షిణాదిలో చాలా ఫేమస్ అయిన సాట్నా.. ఆ తర్వాత యీథవన్, నీది నాదీ ఒకే కథ, తిట్టం పోట్టు తిరుదుర కూటం చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డిస్ట్రిబ్యూటర్ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. 1991 నవంబర్ 28న కేరళలోని కొచ్చిలో జన్మించిన సాట్నా.. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పిచ్చైక్కారన్ (తెలుగులో బిచ్చగాడు) సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా హిట్ కావడంతో సాట్నాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బిచ్చగాడు సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లకు వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లిపై అప్పట్లో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే ఒప్పుకున్న సినిమాలను వదిలేసి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కు సిద్ధపడింది. ఈ దంపతులకు కిరణ్ కార్తిక్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం సాట్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.