తాజాగా సంజయ్ దత్ మాన్యత అగ్నిగుండం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. ఆ వీడియో చూస్తుంటే., వారు ఇద్దరు కూడా గృహప్రవేశ కార్యక్రమంలో ఇలా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సంజయ్ దత్త తమ ఇంటిని పునరుద్ధంగా నిర్మించాడని, ఈ కారణంగానే హోమం చేసి ఉంటారని, అందుకే తన భార్యతో కలిసి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే సంజయ్ దత ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు. అందులో అతడు పెళ్లి చేసుకొని, మెడలో దండలు వేసుకుని అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు కనిపించింది. చూస్తుంటే ఈ బాలీవుడ్ యాక్టర్ 65 ఏళ్ల వయసులో నిజంగానే నాలుగో పెళ్లి చేసుకున్నాడా అని అనుమానం కలుగుతోంది.
కానీ అది నిజం కాదు. ఆమె ఎవరు? ఆ వీడియోలో ఉన్నది, సంజయ్ ప్రస్తుత భార్య మాన్యతా దత్ . క్లిప్పింగ్‌లో ఈ ఇద్దరూ తమ పెళ్లి ప్రమాణాలు మళ్లీ చేసుకున్నారు. అంతే కానీ సంజయ్ వేరొకరిని పెళ్లి చేసుకోలేదు. నాలుగో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు నిజం లేదు. ఈ ముచ్చటైన జంట పెళ్లి చేసుకుని 16 ఏళ్లు గడిచాయి. ఈ సంతోషాన్ని మరోసారి అందరితో పంచుకున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఈ సెలబ్రిటీ కపుల్ మధ్య ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇంటి రెన్నోవేషన్ సందర్భంగా: తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సంజయ్ దత్ కుర్తా, ధోతితో కనిపించాడు. ఆయన భార్య మాన్యతా దత్ క్రీమ్ కలర్ డ్రెస్‌లో మెరిసింది.
ఈ ఇద్దరూ కలిసి కొత్తగా రెన్నొవేషన్ చేసిన తమ ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఆ ఇల్లు ముంబైలో ఉంది. ఈ సందర్భంగా చేసిన పూజలో సంజయ్, మాన్యతా దంపతులు పూజలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో అప్పుడు తీసినదే. మూడో పెళ్లి సంజయ్ దత్ మాన్యతను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట 2008లో గోవాలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అంతకు ముందు రియా పిళ్లై, రిచా శర్మ ఇద్దరిని సంజయ పెళ్లి చేసుకున్నాడు. రియా పిళ్లై ఒక ఎయిర్ హోస్టెస్, మోడల్. రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ 1996లో చనిపోయింది. వీరికి త్రిశాల దత్ అనే కూతురు ఉంది.
మూడో భార్యతో ఇద్దరు పిల్లలు సంజయ్ దత్, మాన్యత దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు షహ్రాన్, ఇక్రా. తన ముగ్గురు పిల్లలూ సంతోషంగా ఉండాలని, తాము ఎంచుకున్న పనుల్లో నిలకడగా ఉండాలని సంజయ్ కోరుకుంటాడు. ఆయన పెద్ద కూతురు త్రిశాల ఒక సైకాలజిస్ట్. అయితే, షహ్రాన్‌కి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని రోజుల క్రితం ఫుట్‌బాల్ ఆడుతుండగా కాలు విరిగింది. ఇక్రా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె గీసిన డ్రాయింగ్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
65 साल के Sanjay Dutt ने की चौथी बार शादी, नवरात्री के मौके पर अपने घर में सादगी से लिये सात फेरे !#sanjaydutt #bollywoodnews #Bollywood pic.twitter.com/ibbTkQFI5w
— E24 (@E24bollynews) October 9, 2024