సనా ఖాన్ ఒక భారతీయ సినీ నటి. పలు దక్షిణాది సినిమాలలో కూడా నటించింది. కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలొ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయంమయ్యారు. ఈమె వివిధ భాషలలొ నటించింది. వాటిలొ హింది, తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలొ నటించింది. అయితే సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్ ఒకరు. 2005లో హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది.
ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా సుపరిచితం. 2010లో కల్యాణ్ రామ్ నటించిన కత్తి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సనాఖాన్. ఆ తర్వాత నాగార్జున గగనం, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జయహో, అక్షయ్ కుమార్ టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథా వంటి హిట్ సినిమాల్లోనూ సందడి చేసింది. అంతకుముందు హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది.
మొత్తం మీద 14 సినిమాలు, 50కు పైగా యాడ్లలో నటించిన సనాఖాన్ తన సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇండస్ట్రీ కి దూరమైంది. 2019లో విశాల్ నటించిన అయోగ్యలో చివరిగా కనిపించిన ఆ మరుసటి ఏడాదే దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. సనాఖాన్, అనస్ సయ్యద్ దంపతులకు 2023లో ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది.
ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది. . ‘మేము ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అంటూ ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సనా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.