Samantha: నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత రియాక్షన్ ఎలా ఉందొ చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

Samantha: నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత రియాక్షన్ ఎలా ఉందొ చుడండి.

Samantha: నాగ చైతన్య, శోభిత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మరి నాగ చైతన్య మాజీ భార్య సమంత సంగతేంటి అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా అందరికి షాకిస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Also Read : నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి జాతకం చెప్పి చిక్కుల్లో పడిన వేణు స్వామి.

నాగ చైతన్య , శోభిత ధూళిపాళ గురువారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభితాలో ఉన్నది ఏంటి..? సమంత లేనిది ఏంటని అభిమానులు నాగ చైతన్యను ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే నాగ చైతన్య , శోభిత ధూళిపాళల పెళ్లి గురించి సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే సమంతను తాను పెళ్లి చేసుకుంటానని ఓ ఫ్యాన్ చేసిన ప్రపోజల్‌కు మాత్రం ఆమె రియాక్ట్ అయ్యారు. ముఖేష్ అనే అభిమాని సమంతపై తనకున్న ప్రేమను వ్యక్త పరుస్తూ ఒక రీల్ చేసి పోస్ట్ చేశారు. ‘సమంతా.. నువ్వు బాధ పడాల్సిన అవసరం అస్సలు లేదు. నీకు నేనున్నాను. నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతుంది. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నాకోక 2 ఇయర్స్ టైం ఇవ్వు దండిగా డబ్బులు సంపాదిందించి నీ దగ్గరికి వస్తాను.

Also Read : హీరో అక్కినేని నాగచైతన్యకు కాబోయే భార్య ఎన్ని కోట్లకు వారసురలో తెలుసా..?

అప్పటివరకు నా గుర్తుగా ఈ పువ్వు అదే నా హార్ట్‌ను ఉంచుకో’ అని అందులో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. దీంతో వెంటనే సమంత సైతం ఈ వీడియోపై స్పందించింది. ‘నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను.. రీల్ కన్నా నీ బ్యాగ్రౌండ్ లో ఉన్న జిమ్ నన్ను బాగా ఆకట్టుకుంది’ అని కామెంట్ చేసింది. దీంతో ముఖేష్ ఆనందానికి హద్దుల్లేవు. సమంతను ట్యాగ్ చేస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ‘సమంత ఇచ్చిన రిప్లై నా రోజును పూర్తిగా మార్చేసింది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *