మరో అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న సమంత, ఆ నొప్పుల నుంచి ఇంకా..!

divyaamedia@gmail.com
2 Min Read

సమంత విషయానికి వస్తే.. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత.. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అల్లుడు శీను, అత్తారింటికి దారేది ఇలా పలు చిత్రాలలో నటించి, అతి తక్కువ సమయంలోనే తెలుగు నాట ప్రముఖ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది సమంత.

తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలనకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న పిక్‌ను షేర్ చేసింది. ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుంది’ అని రాసుకొచ్చింది.

అలాగే ఈ పోస్టుకు సాడ్ ఎమోజీ కూడా జత చేసింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

కేకే మీనన్, సికందర్ ఖేర్, సిమ్రాన్ బాగా, సకీమ్ సలీమ్, భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఈ సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *