సమంత.. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నీడిల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఒక ఫొటోను తన ఇన్ స్టార్ స్టోరీస్ లో షేర్ చేస్తూ..’ గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా’ అని రాసుకొచ్చింది. అయితే సాధారణంగా హీరోలు యాక్షన్ సీన్లు చేస్తూ గాయపడటం వింటూంటాం. అయిత స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు యాక్షన్ సీన్స్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. యాక్షన్ సీన్ లో గాయపడినట్టు ఆమె తెలిపింది.
మోకాలికి అయిన గాయానికి సూదులతో (ఆక్యుపంక్చర్) చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. గాయాలపాలు కాకుండా యాక్షన్ స్టార్ ను కాగలనా? అని ఆమె రాసుకొచ్చింది. సమంత ఏ చిత్రం షూటింగ్ లో సమంత గాయపడింది? ఎప్పుడు గాయపడింది? అనే వివరాలను మాత్రం సమంత తెలియచేయలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బంగారం’ అనే సినిమా ఉంది. ఈ సినిమా షూటింగ్ లోనే ఆమె గాయపడి ఉండొచ్చని సమాచారం.
చివరిసారిగా సమంత ‘ఖుషి’ సినిమాలో కనిపించింది. మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు, అన్ని భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది. ఈ సిరీస్ కోసం ఆమె ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల ఆమె కొత్త సినిమా ప్రకటించారు. ‘బంగారం’ పేరుతో ఇది సిద్ధం కానుంది. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మారనున్నారు.