సమంత.. విడాకులు తీసుకున్న మహిళను సమాజం ఎలా చూస్తుందో చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. విడాకుల తర్వాత స్త్రీకి చాలా అవమానం, చెడ్డ పేరు వస్తుందని, సెకండ్ హ్యాండ్ అనే మాటలు కూడా వినాల్సి వస్తుందని చెప్పింది. అయితే సమంత ఊ అనాలే గానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం ఉఊ అంటున్నారు. ఈ మధ్యే ఓ వేడుకకు వచ్చిన స్యామ్.. తనెందుకు సినిమాలు తగ్గించాననే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తానని.. కానీ తనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేనని.. చేసే ప్రతీ సినిమాకు తనకు చివరి సినిమాలాగే భావిస్తానంటూ చెప్పారు సమంత. ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చాలానే చేసారు సమంత. పాటలకు పరిమితం అయ్యే సినిమాల్లోనూ కనిపించారు. కానీ మయైసైటిస్ తర్వాత స్యామ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. చాలా సెలెక్టివ్‌గా స్టోరీ ఎంచుకుంటున్నారు. రెగ్యులర్ కారెక్టర్స్‌కు పూర్తిగా దూరమయ్యారు.
కథ నచ్చితే విలన్‌గానూ మారిపోతున్నారు. తాను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి.. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానంటున్నారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ, సిటాడెల్‌లో పాత్ర అలా చేసినవే చెప్పారు స్యామ్. ముఖ్యంగా రాజ్ డికే దర్శకద్వయం గురించి గొప్పగా చెప్పారు ఈ బ్యూటీ. తనకు ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డికేకు థ్యాంక్స్ చెప్పారు సమంత.
రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‌లోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు సమంత. అంటే ఇప్పట్లో స్యామ్ నుంచి సినిమాలు ఆశించడం కష్టమే.. ఒకవేళ చేసినా రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ అయితే చేయదు. పైగా హెల్త్ దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తానంటున్నారు. మొత్తానికి కెరీర్‌పై పక్కా ప్లానింగ్‌తోనే ఉన్నారు సమంత.