సమంతతో నటించొద్దని వారు వార్నింగ్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

సమంత..సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ.. హీరో రేంజ్ లో ఇమేజ్ ను సాధించింది. గ్లామర్ రోల్స్ కు పుల్ స్టాప్ పెట్టేసి.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెరుస్తోంది. డివోర్స్ తరువాత సమంత చేసిన సినిమాలన్నీ విమెన్ సెంట్రిక్ సినిమాలే కావడం విశేషం. యశోద, శాకుంతలం, ఓ బేబీ లాంటి సినిమాలు సమంతలోని సత్తాని జనాలకు చాటాయి. అయితే వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ మరికొద్ది రోజుల్లో అమెజాన్‌లో విడుదల కానుంది.

సమంత, వరుణ్ ధావన్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వరుణ్ ధావన్.. సమంతపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడిన విషయాలను బయట పెట్టాడు. ‘సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. సమంతతో నటించాలని ముందే నిర్ణయించుకున్నాను. ‘సిటాడెల్’ ఆఫర్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఆ సమయంలో నాతో కొంత మంది సమంతపై నెగిటివ్ గా మాట్లాడారు.

సమంతతో పని చేయవద్దు, ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువ. పైగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. షూటింగ్ కూడా టైమ్ కు పూర్తి చేయదు. మీ పెయిర్ కూడా కుదరదన్నారు. అయితే నేను సమంతతో కలిసి పనిచేస్తానని వారితో చెప్పాను’ అని తెలిపాడు వరుణ్. అయితే సమంతతో నటించవద్దని చెప్పిన వారి పేర్లు బయట పెట్టలేదీ స్టార్ హీరో. ‘సిటాడల్‌’ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమై చాలా రోజులైంది. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ సిరీస్ పట్టాలెక్కింది. అయితే మధ్యలో సమంత అనారోగ్యం పాలు కావడంతో షూటింగ్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టింది.

కాగా ఆంగ్ల నవల ‘సిటాడెల్’ను రోజ్ సోదరులు ఆంగ్లంలో వెబ్ సిరీస్‌గా రూపొందించారు. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. అదే వెబ్ సిరీస్ ఇటాలియన్ భాషలో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే వెబ్ సిరీస్ హిందీలో కూడా విడుదల కానుంది. కథను యథాతథంగా ఉంచుతూ ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు దర్శకులు రాజ్ అండ్ డీకే. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *