సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఖరీదైన వాచ్‌లను కొంటూ ఉంటారు. ముఖ్యంగా వజ్రాలు పొందిన వాచ్‌లు అంటే సల్మాన్ ఖాన్ కు మరింత ఇష్టమట. తాజాగా సల్మాన్ ఖాన్ జాకబ్ అండ్ కో బిలినియర్ 3 లగ్జరీ వాచ్ ని ధరించినట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వాచ్ ధరించడమే కాకుండా ఈ బ్రాండెడ్ ఓనర్ ని కూడా కలవడం జరిగింది సల్మాన్ ఖాన్. అయితే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ .. సందర్భమేదైనా సల్మాన్ ఖాన్ ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు.
దుస్తులతో పాటు అతను ధరించే వాచ్ లు, బ్రేస్ లెట్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తరచూ ఖరీదైన వాచ్‌లతో కనిపిస్తుంటాడు. అందులోనూ వజ్రాలు పొదిగిన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. అలా తాజాగా జాకబ్ అండ్ కో బిలియనీర్ III లగ్జరీ వాచ్‌ను ధరించాడీ బాలీవుడ్ సూపర్ స్టార్. అంతేకాదు. అంతేకాదు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియోను జాకబ్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే..ఇందులో వందల కొద్దీ వజ్రాలు ఉన్నాయి. ఈ వాచ్ లో 152 తెల్లని వజ్రాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో 76 వజ్రాలు ఉంటాయి. అలాగే బ్రాస్లెట్లో 504 వజ్రాలు ఉన్నాయి. అలా మొత్తం కలిపి వాచ్‌లో 714 వజ్రాలు ఉన్నాయి. ఈ వాచ్ ధర సుమారు రూ.41.5 కోట్లు. ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వాచ్ అమ్మితే 5 రోల్స్ రాయిస్ లు వస్తాయంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఈ వాచ్ కొనలేదని తెలుస్తోంది. జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్‌కు అలంకరించాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయితే సల్మాన్ తల్చుకుంటే ఈ ఖరీదైన వాచ్ కొనుక్కోవడానికి ఎక్కువ సమయం పట్టదంటున్నారు అభిమానులు.