గ్యాంగ్‌స్టర్ దెబ్బకి ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్, దాని ధర ఏంటంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

కండలవీరుడు నిస్సాన్‌ కంపెనీకి చెందిన అత్యాధునిక హై ఎండ్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఎస్‌యూవీని ఇంపోర్ట్ చేసుకున్నాడు. గత నెలలో ఈ బాలీవుడ్ ఓల్డ్ బ్యాచిలర్‌కి బెదిరింపుల ఫోన్‌ కాల్స్‌ వచ్చిన నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరులు బెదిరిస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. దీని తరువాత, సల్మాన్ ఖాన్ మరింత అలర్ట్ అయ్యాడు.

ప్రభుత్వం కూడా సూపర్ స్టార్ తో పాటు అతని ఇంటి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ప్రభుత్వంపై ఆధారపడకుండా తన భద్రతను తానే చూసుకుంటాడు. ఇప్పటికే ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ సల్మాన్ ఖాన్ కు భద్రత కల్పిస్తోంది. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత బాడీగార్డ్ షేరా కూడా అతనితో ఉంటాడు. వీటన్నింటితో పాటు సల్మాన్ ఖాన్ ముంబై పోలీసుల నుండి లైసెన్స్‌తో ఆటోమేటిక్ గన్‌ని కూడా కొనుగోలు చేశాడు. ఇది కాకుండా, సల్మాన్ ఖాన్ ఇటీవల బుల్లెట్ కారును కొనుగోలు చేశాడు, దాని కోసం అతను భారీ మొత్తంలో ఖర్చు చేశాడు.

ఇటీవల బాబా సిద్ధిఖీ మరణం తర్వాత సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం సల్మాన్ ఖాన్ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని తెలుస్తోంది. విదేశాల నుంచి ప్రత్యేక ఆర్డర్ పై నిస్సాన్ ఎస్ యూవీని సల్మాన్ కొనుగోలు చేశాడట. ఈ కారుకు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా చాలా నే ఉన్నాయట. ఏకే 47 గన్ నుంచి వచ్చే బుల్లెట్లను ఆపగలిగే అత్యంత శక్తిమంతమైన అద్దాలను అమర్చడం వల్ల కారు బాడీ మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ అని చెబుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ తో పాటు ఈ కారులో బాంబ్ అలర్ట్ టెక్నాలజీ కూడా ఉందట.

ల్యాండ్ మైన్లను కూడా గుర్తించడంతో పాటు బాంబు దాడులను వీలైనంతవరకు తట్టుకునేలా ఈ కారును రూపొందించారట. సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తన భద్రతపై శ్రద్ధ పెట్టాడు. అలాగనీ షూటింగులు ఆపలేదు. బదులుగా సల్మాన్ ఖాన్ ఈరోజు బిగ్ బాస్ కోసం షూట్ చేశాడు. ఇంతలో ముంబై ట్రాఫిక్ పోలీసులకు ‘సల్మాన్ ఖాన్‌ను క్షమించాలంటే లారెన్స్ బిష్ణోయ్ 5 కోట్లు చెల్లించాలని, లేకపోతే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా చనిపోతాడని’ మెసేజ్ వచ్చింది. బెదిరింపు సందేశం పంపిన వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *