కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.1998లో తన సినిమా ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో జోధ్‌పూర్‌లో రెండు కృష్ణజింకలను చంపిన కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే 1998లో సల్మాన్ ఖాన్ హీరోగా ‘హమ్ హమ్ సాథ్ సాథ్’ అనే సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్ జోధ్ పూర్ జిల్లాకు వెళ్లారు. కంకణి గ్రామంలో షూటింగ్ చేశారు. ఆ టైమ్ లో సల్మాన్ ఖాన్ తో పాటు నటుడు సైఫ్ అలీఖాన్, హీరోయిన్లు టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారి, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే దివంగత రాజేష్ పైలెట్ కొడుకు దుష్యంత్ సింగ్, డ్రైవర్ సతీష్ షా ఉన్నారు.
ఆ రోజు రాత్రి అక్కడే బస చేశారు. ఆ సమయంలో సల్మాన్ తో పాటు వీళ్లంతా కలిసి అడవిలో వేటకు వెళ్లి రెండు కృష్ణ జింకలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలిసి బిష్ణోయ్ వర్గానికి చెందిన కొంత మంది కేసు పెట్టారు. సల్మాన్ మీద భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం(1972) సెక్షన్ 51, సైఫ్ అలీ ఖాన్, టబు, సొనాలీ బింద్రే, నీలం మీద సెక్షన్ 51 రెడ్ విత్ సెక్షన్ 149 కింద కేసులు నమోదయ్యాయి. 10 రోజుల తర్వాత సల్మాన్ అరెస్ట్ అయ్యారు. వెంటనే ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 1998లో ఘటన జరగ్గా, 2006లో విచారణ మొదలైంది. 2007లో సల్మాన్ ను న్యాయస్థానం దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఈ శిక్షను సస్పెండ్ చేసింది.
2018లో ఈ కేసుపై విచారణ జరగ్గా, సల్మాన్ ఖాన్ ను మరోసారి దోషిగా తేల్చిన న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో శిక్ష పడినప్పటికీ సల్మాన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ బ్యాచ్ ఆయను టార్గెట్ చేసింది. కృష్ణ జింకల వేట కేసుఓ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సల్మాన్, ఈ కేసు గురించి కీలక విషయాలు చెప్పారు.
తాను కృష్ణ జింకలను చంపలేదని చెప్పారు. అవన్నీ కేవలం ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఆ సమయంలో తాము అక్కడ లేమన్నారు. కృష్ణ జింకలకు మూడుసార్లు పోస్టుమార్టం చేశారని, రెండుసార్లు ఆ జింకలు వేరే వేరే సమస్యలతో చనిపోయాని రిపోర్టు వచ్చిందన్నారు. మూడోసారి రిపోర్టు మారిందన్నారు. తన వాహనంలో ఉన్నది కూడా ఎయిర్ గన్ అన్నారు. దానితో కాల్చినా ఎవరికీ ఏం కాదన్నారు సల్మాన్.