సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శస్త్రచికిత్స అనంతరం నటుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి నటి కరీనా కపూర్ వాంగ్మూలాన్ని కూడా త్వరలో నమోదు చేస్తారని భావిస్తున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ స్టార్ హీరో. భారతీయ సినిమా ఇండస్ట్రీలో భారీ ఆస్తులు ఉన్న నటుల్లో అతను కూడా ఒకరు. వద్ద పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.
అయితే దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతోన్న సైఫ్ అలీఖాన్ ను ఆటోలోనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు అతని కుమారుడు ఇబ్రహీం అలీఖాన్. గ్యారేజ్ లో లగ్జరీ కార్డు ఉన్నప్పటికీ ఇలా ఆటోలోనే సైఫ్ ఆస్పత్రికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు కారణం కూడా ఉంది. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఇంట్లో శబ్దాలు విని సైఫ్ లేచాడు. అక్కడ ఓ దుండగుడు పనివాళ్లతో గొడవ పడడం చూశాడు. వెంటనే అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో నటుడి మెడ, వీపు సహా ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వెన్ను భాగంలో కత్తి మొన కూడా ఇరుక్కుంది. రక్తపు మడుగులో ఉన్న సైఫ్ ను చూసి అతని కుమారుడు ఇబ్రహీం చలించిపోయాడు. వెంటనే తండ్రిని ఆస్పత్రి నుంచి కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే,కార్లు ఏవీ సిద్ధంగా లేవు. డ్రైవర్లు కూడా అందుబాటులో లేరు. దీంతో ఇంటి బయటికి వెళ్లి ఆటో తీసుకొచ్చాడు. సైఫ్‌ను అందులోనే ఆసుపత్రికి తరలించారు. ఇదే సందర్భంలో కరీనా కపూర్ ఇంట్లో టెన్షన్‌తో నడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.