హీరో రాహుల్ రవీంద్రన్ ఇంట తీవ్ర విషాదం, నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి అంటూ..!

divyaamedia@gmail.com
2 Min Read

రాహుల్ రవీంద్రన్.. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్న రాహుల్ అనంతరం పలు చిత్రాల్లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించారు. పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో సైతం మెరిశారు. అయితే తాజాగా రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు రాహుల్.

కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయ్ నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్ కు అండగా నిలుస్తున్నారు. అలాగే తన తండ్రి గురించి చెబుతూ.. తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ సినిమాను గుర్తుచేసుకున్నారు రాహుల్. “చి.ల.సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను. అది ఇప్పుడు భిన్నంగా అనిపిస్తుంది.

నాన్న ఉన్నారులే.. అన్ని చూసుకుంటారు. అనే మాటకు విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తోంది.. నాకు ఈరోజు అర్ధమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది. థాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు రాహుల్. అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్.

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న రాహుల్.. ఆ తర్వాత హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అలాగే పలు చిత్రాల్లో విలన్ పాత్రలు సైతం పోషించారు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. సింగర్ చిన్మయి శ్రీపాదను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవలలు ఉన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *