అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్ ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోమని తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్.. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. తెలంగాణ రైజింగ్‌లో బిజినెస్ మోడల్‌ని తీసుకెళ్దామన్నారు భట్టి.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీ అనంతరం కర్ణాటక రాష్ట్రం బెలగావికి వెళ్లారు. బెలగావిలో రెండ్రోజులపాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్ రెడ్డి పాల్గొననున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన విదేశాలలో ఉన్నారని తెలుస్తుంది. అయితే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మాట్లాడారని సమాచారం. ఇక గురువారం సీఎం భేటీకి టాలీవుడ్ నుండి నిర్మాతలైన..
అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్, కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ హాజరు అయ్యారు.