డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సమయంలోనే పవన్, రేణు దేశాయ్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన జానీ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.
2009లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరగ్గా..ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్య జన్మించారు. అయితే రేణు దేశాయ్.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ సమయంలోనే పవన్, రేణు దేశాయ్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన జానీ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. 2009లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరగ్గా..ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్య జన్మించారు. కానీ కొన్నేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన కొడుకు, కూతురుతో కలిసి ఉంటున్నారు రేణు దేశాయ్.
గతంలో మాస్ మాహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. దాదాపు 18 సంవత్సరాలు నటనకు దూరంగా ఉన్న ఆమె చాలా కాలం తర్వాత స్క్రీన్ పై కనిపించి మరోసారి మ్యాజిక్ చేశారు. ఆ సినిమాలో హేమలత లవణం పాత్రలో అద్భుతమైన నటనతో అలరించారు. ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.