రేఖ గా సుపరిచితులైన భానురేఖ గణేశన్ హిందీ చిత్రాలలో ప్రధానంగా కనిపించే భారతీయ నటి. ఆమె భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె దాదాపుగా 200 చిత్రాలలో నటించింది. అయితే రేఖ.. ఇప్పటితరానికి ఈమె గురించి పెద్దగా తెలియదు కానీ.. అసలు ఒకప్పుడు ఈ హీరోయిన్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రేఖ సినిమా వస్తుందంటే ఒక యుఫోరియా క్రియేట్ అయ్యేది. అసలు రేఖ కెరీర్ స్టార్ట్ అయిందే తెలుగు సినిమాతో.
1958లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత 8 ఏళ్లు గ్యాప్ తీసుకుని రంగుల రాత్నం సినిమాలో నటించింది. చంద్రమోహన్, వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా… రేఖ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తెలుగులో రేఖకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాలుగేళ్లకు అమ్మకోసం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
కాగా.. ఈ సినిమా తర్వాత, ఇప్పటివరకు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదు. కాకపోతే పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించింది. ఇప్పటితరానికి రేఖ యాడ్స్ ద్వారా సుపరిచితం.ఇక ఇదిలా ఉంటే… ఈ హీరోయిన్ తను కెరీర్ స్టార్టింగ్‌లో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి ఆ మధ్య ఓ ఇంటర్వూలో తెలిపింది. అదేంటంటే.. ఈ నటి తను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అంజనా సఫర్ అనే సినిమా చేసింది. అప్పటి స్టార్ బిస్వజిత్ ఛటర్జి ఈ సినిమాలో హీరో అప్పటికీ ఈ హీరో 32 ఏళ్లు ఉన్నాడు. కాగా ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో ఈ హీరో హీరోయిన్ పెదవులపై బలవంతంగా ముద్దు పెట్టాడట.
దాంతో రేఖ ఒక్కసారిగా షాక్‌కు గురై సెట్‌లోనే బోరున ఏడ్చేసిందట. అయితే అప్పటికే ఓ ఇంటిమేట్ సన్నివేశం చేస్తుండగా… డైరెక్టర్ చెప్పాడని ముద్దు పెట్టుకున్నట్లు బిస్వజిత్ ఓ ఇంటర్వూలో చెప్పాడు. అలా మొత్తానికి రేఖ… ఒక హీరో వల్ల కెరీర్ స్టార్టింగ్‌లోనే రేఖ కన్నీరు పెట్టుకుంది. అది కూడా 15 ఏళ్ల వయసుకే. 69 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రేఖ అదరగొడుతుంది. మరోవైపు బిస్వజిత్ ఛటర్జీ ప్రస్తుతం 87ఏళ్లు ఉన్నాడు.