రెజీనా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాన్ని వెల్లడించింది. నటి రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో, ఆమె పిల్లల టీవీ ఛానెల్ లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ముద్దుముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయస్సులో, నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది. అయితే రెజీనా కసాండ్రా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”
నా అసలు పేరు రెజీనా మాత్రమే. కానీ మా తల్లిదండ్రుల విడాకుల తర్వాత నా పేరు చివర కసాండ్రా అనే పేరు కూడా యాడ్ అయ్యింది. అలాగే నేను పుట్టినప్పుడు ఇస్లాం మతంలో ఉన్నాను. కానీ పెరిగాక క్రిస్టియన్ మతంలోకి చేరాను. దానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు విషయం ఏమిటంటే.. మా అమ్మ నాన్న ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. మా నాన్న ఇస్లాం మతానికి చెందిన వారు కాగా.. మా అమ్మ క్రిస్టియన్ మతస్థురాలు.. అలా వీరిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లయిన తర్వాత నేను పుట్టాక కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత అమ్మానాన్నల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. నాకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే నేను పుట్టగానే మా అమ్మ నాన్న నాకు రెజీనా అని పేరు పెట్టారు. ఇక వీళ్ళ విడాకుల తర్వాత మా అమ్మ క్రిస్టియన్ మతంలోకి మళ్లీ మారిపోయింది.
కాబట్టి నా పేరు చివర కసాండ్రా అనే పేరుని కూడా యాడ్ చేసింది..అయితే నేను ఎక్కువగా కుల మతాలను అస్సలు పట్టించుకోను. నేను అన్ని రకాల దేవుళ్లను మొక్కుతాను. గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మసీదుకు కూడా వెళ్తాను. కులం, మతం విషయంలో నాకు ఎలాంటి పట్టింపులు లేవు” అంటూ రెజీనా కసాండ్రా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.