రానా.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలోకి గ్రాండ్ వెల్‌కమ్ దొరికింది. ఈ సినిమా అటు కమర్షియల్‌గా, ఇటు క్రిటిక్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్టయిపోయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు కానీ.. అన్ని ఫ్లాపులగానే నిలిచాయి. మధ్యలో కృష్ణం వందే జగద్గురుమ్ ఒక్కటి పర్వాలేదనిపించింది.
అయితే దగ్గుబాటి సురేష్ బాబు భార్య లక్ష్మి తల్లి అయిన రాజేశ్వరి దేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజేశ్వరి దేవి మరణంతో రానా కుటుంబసభ్యులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అమ్మమ్మకు తుది వీడ్కోలు పలికే సమయంలో.. రానా భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత్యక్రియల్లో రానా, అతని తల్లి లక్ష్మి, దగ్గుబాటి సురేష్ బాబు పాల్గొన్నారు. కాగా అమ్మమ్మ పాడెను రానా మోసారు. రాజేశ్వరి దేవి మరణం దగ్గుబాటి కుటుంబానికి తీరని లోటుగా మారింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.