రజినీకాంత్ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అనే వార్త అభిమానులని కంగారు పెట్టింది. అయితే రజిని ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు సమాచారం తెలుస్తుంది. రజిని ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారట. అయ్యి ఇంటికి కూడా వెళ్లారని తెలుస్తోంది. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పారట. అయితే గత మూడు రోజులుగా చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అపోలో హాస్పిటల్ వైద్య బృందం ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే తమ అభిమాన హీరో డిశ్చార్జ్ అవడంతో ఆయనను నేరుగా కలవడానికి ఎంతో మంది అభిమానులు హాస్పిటల్ దగ్గరికి రావడం ఆయన క్రేజ్ కి నిదర్శనంగా నిలుస్తోంది. ఇకపోతే వారం రోజులపాటు విశ్రాంతి అనడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం వేట్టయాన్. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగంగా చేపట్టాల్సి ఉంటుంది.
అయితే ఇలాంటి సమయంలో రజినీకాంత్ ను వైద్యులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా అయినా సరే సక్సెస్ సాధించాలి అంటే దానికి ప్రమోషన్స్ అనేది తొలి అడుగు పడుతుంది. అందుకే హీరోలు సాధ్యమైనంత వరకు ప్రమోషన్స్ తోనే సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తారు. సినిమా ఎంత బాగున్నా సరే సినిమా ప్రేక్షకులకు రీచ్ అయినప్పుడే దానిని థియేటర్లో చూడడానికి వస్తారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వేట్టయాన్ కి కనిపించడం లేదు.
ఎందుకంటే అనారోగ్య పరిస్థితి కారణంగా రజనీకాంత్ ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నారు. మరి సినిమాపై తీసుకొచ్చి చిత్ర బృందం ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయం కూడా అభిమానులలో ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ఎన్నో విషయాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరి రజినీకాంత్ సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి ఇంటి నుంచే ప్రమోషన్స్ చేపడతారా అన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది..మరి ఏం జరుగుతుందో చూడాలి.