దీన స్థితిలో ఉన్న పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేసిపెద్ద మనసు చాటుకున్న యంగ్ హీరో.

divyaamedia@gmail.com
2 Min Read

నటి పావలా శ్యామల ఇటీవల తన దీన స్థితిని వివరిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆసుపత్రిలో చూపించుకునేందుకు డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అనారోగ్య, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందజేశాడు. ప్రస్తుతానికి లక్ష రూపాయలు ఆమె చేతికి అందజేసి భవిష్యత్ లో ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

శ్యామ‌ల ఆర్థిక ప‌రిస్థితి ప్ర‌స్తుతం అస్సలు బాగోలేదు. అనారోగ్యానికి తోడు ఆర్థిక సమస్యతో ఆమె కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు సాయం చేయాలంటూ ఇటీవల ఓ వీడియో ద్వారా తన కష్టాలను చెప్పుకొచ్చింది. 50 ఏళ్లుగా క‌ష్ట‌ప‌డి న‌టిగా బ్రతికాను. కానీ ఈ మూడు ఏళ్ల నుంచి నా ప‌రిస్థితి దీనంగా మారిపోయింది. ఇది అంద‌రికీ తెలుసు. నా సమస్యలను చాలా ఇంట‌ర్వ్యుల‌లో కూడా చెప్పాను. కానీ పెద్దగా ఎవ‌రు స్పందించ‌లేదు. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను.

చిరంజీవి, ప్రభాస్‌, మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా ఎందరో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక అవస్థలు పడుతున్నాను. ద‌య‌చేసి త‌న‌కు సాయం చేయండి’ అంటూ శ్యామ‌ల త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పావల శ్యామల వీడియోను చూసిన ఆకాశ్‌ పూరి చలించిపోయాడు.

ప్ర‌స్తుతం శ్యామ‌ల ఉంటున్న ఉషా సీనియ‌ర్ సిటిజ‌న్స్ వెల్ఫేర్ డెవ‌ల‌ప్‌మెంట్ సోసైటీకి వెళ్లిన ఆకాశ్ అక్కడ ఈ నటిని క‌లిశాడు. ఆమె బాగోగులు తెలుసుకున్నాడు. అనంత‌రం ల‌క్ష రూపాయలు చేతికి అందించాడు. ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానంటూ భరోసాను అందించాడు ఆకాశ్. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. పూరి మంచి మనసును ప్రశంసిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *