పిల్లలను కనాలనుకునే జంట నేరుగా కాకుండా మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరోగసీ అంటారు. పిల్లలు కావాలనుకునే జంటలో.. పురుషుడి వీర్యాన్ని స్వీకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ జంట కోసం పిల్లలను తన కడుపులో పెంచి, ప్రసవించే మహిళను సరోగేట్ మదర్ అంటారు. కేవలం పురుషుడి వీర్యంతో బిడ్డను కనిపెంచిన ఆ మహిళ, బిడ్డకు బయోలాజికల్ మదర్ అయినప్పటికీ.. ప్రసవం అనంతరం ఆ స్త్రీకీ, బిడ్డకూ ఎటువంటి సంబంధం లేకుండా ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు.
అయితే ప్రీతి జింటా.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, తాము తల్లిదండ్రులుగా మారడం గురించి మొదటి సారి మాట్లాడింది ప్రీతి జింట. తన సమస్యల గురించి ప్రీతి మొదటిసారిగా మాట్లాడింది. తల్లిగా మారినప్పుడు తాను ఎంత సంతోషించాను అనేది చెపుతూనే.. తాను అనుభవించిన ఇబ్బందుల గురించి కూడ ామాట్లాడింది. తన జీవితంలో సంతోషకరమైన రోజులతో పాటు.. కష్అంటాలు కన్నీళ్లు కూడా ఉన్నాయన్నారు ప్రీతి. ఎన్నో కష్టాలను దాటుకుని వచ్చానని ఆమె ఒప్పుకుంది. తన ఐవిఎఫ్ రౌండ్ సమయంలో, సంతోషంగా ఉండటానికి తాను చాలా కష్టపడ్డానని ఆమె చెప్పింది.
49 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరిలాగే తనకూ మంచి, చెడు రోజులు ఉన్నాయని అంగీకరించింది. తల్లికావాలని తపనతో ఎంతో ప్రయత్నించని ప్రీతి చివరికి సరోగసీని ఎంచుకుంది. ప్రీతి జంటకు నవంబర్ 2021లో తన కవలలు జన్మించారు. వారి పేర్లు గియా మరియు జైల. ప్రీతి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ సమయంలో ఎంత పెయిన్ ను అనుభవించింది అనేది చెప్పుకుని బాధపడింది. ఆ బాధను భరించలేక ఆమె ఆమె గోడకు తలని బాదుకుని ఏడవాలనుకునేదట. ఈ డిప్రెషన్ లో.. తాను ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోవడం.. ఎవరితో మాట్లాడకపోవడం లాంటి అనుభవాలను ఫేస్ చేశానంటోంది.
ప్రీతి జింటా , ఆమె జీవిత భాగస్వామి జీన్ గుడ్‌ఎనఫ్ నవంబర్ 2021లో తమ కవల పిలిల్లలకు వెల్కం చెప్పారు. ఈ గుడ్ న్యూస్ ను ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. తనకు సపోర్ట్ గా నిలిచి ప్రతీ ఒక్కరికి ఆమె తన కృతజ్ఞతలు తెలియజేసింది. అంతే కాదు అప్పుడే ఆమె తన పిల్లల పేర్లను కూడా ప్రకటించింది. తన పిల్లల కోసం సహకరించినందుకు ప్రీతి సరోగేట్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 2022లో మాతృ దినోత్సవం సందర్భంగా ప్రీతి తన కవల పిల్లల ఫస్ట్ ఫోటోను నెట్టింట శేర్ చేసింది.