మనదేశంలోని ఆ గ్రామంలోని మగాళ్ల కోసం విదేశాల నుంచి వస్తున్న అమ్మాయిలు, డబ్బులు ఇచ్చి మరీ వాళ్లతో పడుకొని..?

divyaamedia@gmail.com
2 Min Read

భారతదేశంలో అనేక విషయాలు ఎంతో నిగూఢమైనవిగా కనిపిస్తుంటాయి. అందులో కొన్నిప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని మానవ నిర్మితం. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా కూడా విరాజిల్లు తున్నాయి. ఇక మానవ నిర్మితమైన కొన్ని భవనాల చిక్కు ముళ్లను నేటి ఆధునిక సాంకేతిక పరిజ్జానం కూడా ఛేదించలేక పోతుండటం గమనార్హం. అయితే విదేశీయులకు భారతదేశం ఓ ఆకర్షణీయమైన డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టూరిస్ట్‌లు.. మన దేశంలోని మతపరమైన, చారిత్రిక కట్టడాలను చూడటానికి మాత్రమే కాదు.. పలు ప్రాంతాల్లోని సహజమైన అందాలను కూడా ఆస్వాదించేందుకు వస్తుంటారు.

అలాంటి అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి లడఖ్. లడక్‌లోని సింధూ నది ఒడ్డున కొన్ని గ్రామాలు ఉంటాయి. ఇక ఈ గ్రామాల్లో సహజమైన వనురులతో పాటు అందమైన ఆజానుబాహులు ఉంటారు. ఇక ఆ అందమైన ఆజానుబాహుల్లాంటి పిల్లలను కనాలని.. యూరోప్ దేశం నుంచి మహిళలు ఇక్కడికి వస్తుంటారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. నూటికి నూరుశాతం నిజమండీ.! దీనికి వాళ్లు పిలుచుకునే పేరు ‘ప్రెగ్నెన్సీ టూరిజం’. లడఖ్ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇది ఇప్పుడు ఇది బిజినెస్‌గా మారింది.

ఆ గ్రామాలకు విదేశీ యువతుల రాక.. ఇప్పటి మ్యాటర్ కాదు.. ఏకంగా 2000 సంవత్సరం నుంచే ఇది మొదలైంది. కార్గిల్‌కు 70 కిలోమీటర్ల దూరంలో లడఖ్‌లో ఒక గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని ఆర్య వ్యాలీ అని అంటారు. ఇక్కడ నివసించే పురుషుల ద్వారా గర్భం దాల్చడానికి 2000 సంవత్సరం నుంచి విదేశీ మహిళలు వస్తున్నారు. ఈ ఆర్య వ్యాలీలో ‘బ్రోక్పా తెగ’ నివాసముంటోంది. ఈ తెగలు ‘అలెగ్జాండర్- ది గ్రేట్’ సైన్యానికి చెందినవారని చెబుతుంటారు.

అలాగే, అలెగ్జాండర్ భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు, అతని సైన్యంలో కొంతభాగం ఇక్కడే ఉందని చరిత్ర నిపుణులు అంటుంటారు. ఈ జాతికి చెందిన పురుషుల నుంచి గర్భం దాల్చినట్లయితే, బిడ్డకు ఈ ఆర్యుల జాతికి చెందినవారికి ఉన్న మాదిరిగానే మంచి శరీరాకృతి, నీలిరంగు కళ్లు, పసిమి ఛాయ వస్తాయని యూరోపియన్ మహిళలు నమ్ముతారు. అందుకే ఇక్కడికి యూరోప్‌కు చెందిన మహిళల రాక విపరీతంగా పెరిగింది. వారితో శృంగారంలో పాల్గొని.. ఆ విదేశీ యువతులు.. ఆర్యజాతి పురుషులు డబ్బులు కూడా చెల్లిస్తారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *