యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డార్లింగ్ సినిమాలు విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. అయితే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఎన్ని హిట్స్ వచ్చినా తనలోని ఆ కల్మషం లేని గుణమే అతన్ని నిజమైన డార్లింగ్‌ను చేసింది.
ప్రభాస్ మంచితనం గురించి ఎందరో సినీ తారలు ఇప్పటికే చాలా సార్లు పంచుకున్నారు. కాగా నేడు (అక్టోబర్ 23) పుట్టిన రోజును పురస్కరించుకొని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్‌కు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ గొప్ప మనసుకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది.
వివరల్లోకి వెళితే.. గతంలో కన్నయ్య అలియాస్ రంజిత్ అనే ప్రభాస్ అభిమాని తీవ్రమైన అనారోగ్యసమస్యతో బాధపడ్డాడు. చివరి రోజులు గడుపుతున్న కన్నయ్యకు ప్రభాస్‌ను కలవాలనే బలమైన కోరిక ఉడేది. దీంతో దీంతో అతని తల్లి పూరి జగన్నాథ్ భార్య లావణ్యకి ఫోన్ చేసి .. విషయం చెప్పారు. లావణ్య ప్రభాస్‌తో మాట్లాడడంతో కలవడానికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా కన్నయ్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటని కనుక్కొని మరీ ప్రభాస్ చికెన్ మంచూరియా చేయించి తీసుకెళ్లాడు.
అదేవిధంగా బాహుబలిలో వాడిన ఓ కత్తిని కూడా అభిమానికి ఇచ్చాడు. ఇదంతా కన్నయ్య తల్లి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా ఈ వీడియో మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ అభిమాన హీరో మనసు ఎంత గొప్పదో అంటూ మురిసిపోతున్నారు.
Intha Kanna em Chepagalam Ayya Ni Gurinchi 🥺❤️
— Shiva Prabhas (@Shivaprabhas67) October 23, 2024
Ma Devudu Vi anna #HappyBirthdayPrabhas pic.twitter.com/0nrbs0wIow