పెళ్లి రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. పెళ్లి రోజే తల్లి కావడంతో..!

divyaamedia@gmail.com
2 Min Read

కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకొని తల్లి తల్లిదండ్రులు అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు గానీ తర్వాత మళ్లీ తమ కెరియర్ వైపు ఫోకస్ చేస్తున్నారు. అయితే పిల్ల జమీందార్ సినిమా ఫేమ్, ప్రముఖ కన్నడ హీరోయిన్ హరిప్రియ అమ్మగా ప్రమోషన్ పొందింది. ఆదివారం ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ సంతోషకరమైన వార్తను హరిప్రియ భర్త, ప్రముఖ నటుడు వశిష్ట సింహ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు.

‘బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హరిప్రియ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు వశిష్ట సింహా. దీతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన హరిప్రియ- వశిష్ట దంపతులకు కుటుంబ సభ్యులు, బంధువులు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. హరిప్రియ, వశిష్ఠ సింహా పెళ్లి రోజునే వారు అమ్మానాన్నలయ్యారు.

ఈ జంట 2023 జనవరి 26న వివాహం చేసుకున్నారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అంటే జనవరి 26, 2025న పండంటి మగ బిడ్డ వారి జీవితంలోకి అడుగు పెట్టాడు. ‘దీంతో మా పెళ్లి రోజునే వచ్చాడు’ అని వశిష్ఠ సింహ పోస్ట్ చేశాడు. హరిప్రియ, వశిష్ఠ సింహ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే పెళ్లి తర్వాత హరిప్రియ తన కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చింది. గర్భం ధరించగానే సినిమా షూటింగులకు దూరం అయ్యింది. హరిప్రియ కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఫేమస్. ముఖ్యంగా తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార.

నాని పిల్ల జమీందార్ తో పాటు వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది హరిప్రియ. అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. అయితే దీని తర్వాత తెలుగు వెండి తెరపై కనిపించలేదీ అందాల తార.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *