ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మదాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనలో ఓ వివాహిత మృతి చెందింది. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ప్రభుత్వం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే… శుక్రవారం అకస్మాత్తుగా అల్లు అర్జున్‌ను ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన వెంటనే.. చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో అల్లు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. శుక్రవారం జైలుకెళ్లిన అల్లు అర్జున్‌ను శనివారం పోలీసులు విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్ విడుదల అయిన నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా ఆయనను కలిసి తమ మద్దతు ప్రకటించారు. నాగచైతన్య, అఖిల్, రానా, వెంకటేష్, సుకుమార్, సుధీర్ బాబు, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖులంతా కలిశారు.
అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్‌ను కలుస్తారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే అంతా పవన్ .. బన్నీని కలిసేందుకు వస్తున్నాడని భావించారు. కానీ.. ఇవాళ ఉదయం అంటే ఆదివారం ఉదయం మళ్లీ పవన్ గన్నవరం వెళ్లిపోయారు.
హైదరాబాద్ వచ్చిన పవన్… అల్లు అర్జున్‌ను కలవలేదు. ఆయన హైదరాబాద్ కూడా తన పర్సనల్ పనిమీద వచ్చారని సమాచారం. ఆ పని చూసుకొని వెంటనే పవన్ తిరిగి గన్నవరం వెళ్లిపోయారని తెలుస్తుంది.