తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసి బాలయ్య స్వర్ణోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బన్నీ బాలయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. వేడుకకు వస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించారు బాలకృష్ణ.
ఆతర్వాత ఎనో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు బాలయ్య. బాలకృష్ణ ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ. ఇక 50 వసంతాలు సెలబ్రేషన్స్ కు చాలా మంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఇతరభాషలకు సంబందించిన స్టార్స్ ను ఆహ్వానించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు.
తాజాగా నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ , నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుంచి మాదాల రవి, శివ బాలాజీ , నిర్మాత ముత్యాల రామదాసు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఇదే వేడుకకు సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇలా ఒకే వేదిక పై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.