నరేష్ 65వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పవిత్ర లోకేష్.. షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త నరేష్‌ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసలు కురిపిస్తూ ఆయన వర్క్ డెడికేషన్, ఎనర్జీ లెవెల్స్ చెప్పుకొచ్చింది. పని విషయంలో నరేష్ ఎంత ఎంగేజ్డ్‌గా ఉంటారో చెప్పే ప్రయత్నం చేసింది పవిత్ర లోకేష్. అయితే ఇక సీనియర్ హీరో నరేష్ తో సహజీవనం(పెళ్లి చేసుకున్నారని టాక్) కొనసాగిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర.. రెండు మూడు రోజుల క్రితం ఏదో కార్యక్రమంలో మాట్లాడుతూ..
” నరేష్ ఎనర్జీ 10 మందితో సమానం. రాత్రి అయిన తర్వాత ఇక నా వల్ల కాదంటూ చెప్పేస్తానని” వ్యాఖ్యానించింది. ఆ మాటలకు ముందు పవిత్ర లోకేష్ ఏం మాట్లాడిందో.. ఎందుకు అలా మాట్లాడిందో.. ఎవరికీ అవసరం లేదు.. జస్ట్ పది మందితో సమానమైన విజయం.. రాత్రి అయితే నా వల్ల కాదని చెప్తాననే మాటలు మాత్రమే ఉండేలా కట్ చేసి వీడియో సోషల్ మీడియాలో వదిలిపడేశారు. ఇంకేముంది కావలసినంత రచ్చ.. జరగాల్సిన చర్చ.. జరుగుతూనే ఉంది. పవిత్ర లోకేష్ మాట్లాడిన మాటలకు దెబ్బకు అమెరికా డోనాల్డ్ ప్రమాణ స్వీకార పర్వం కూడా వెనక్కి పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయినా నేటి కాలంలో సెలబ్రిటీలు.. సెలబ్రిటీలు లాగా ఉండడం లేదు. వారు కూడా బీ గ్రేడ్ స్థాయిలో మాట్లాడుతున్నారు. విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటున్నారు. చివరికి పడకగది ముచ్చట్లను కూడా చెప్పకుండా ఉండడం లేదు. అయినా ఇలాంటి వారిని మన సమాజం సెలబ్రిటీలు అని గౌరవిస్తుంది. చివరికి వారి కటౌట్లు పెట్టి మేకపోతులను బలిస్తోంది. పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తోంది.
#PavitraLokesh SHOCKING Comment – #Naresh garu energy is Equal to 10 People in WORK and I Can’t Handle Him 😳😳😳😳😳pic.twitter.com/nFpSPDl6qV
— GetsCinema (@GetsCinema) January 20, 2025