పావలా శ్యామల తన ధీన స్థితిని మొరపెడుతూ ఒక వీడియోను షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇది అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పావలా శ్యామల తన ధీనావస్తను చూసైనా పరిశ్రమ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని కోరారు. అయితే రంగస్థల నటిగా ఎంట్రీ ఇచ్చి హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సీనియర్ నటి పావలా శ్యామల.
అయితే ఈ నటి ప్రస్తుతం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కష్టంగా జీవనం సాగిస్తున్నారు. అయితే తన ఆర్థిక పరిస్థితి బాగలేదని తనకు సాయం చేయండి అంటూ పావల శ్యామల తాజాగా ఒక వీడియో పెట్టింది. అయ్యా.. 50 ఏండ్లుగా కష్టపడి నటిగా బ్రతికాను. ఈ మూడు ఏండ్ల నుంచి నా పరిస్థితి ఎలా అయ్యిందో అందరికీ తెలుసు. ఈ విషయం చాల ఇంటర్వ్యులలో కూడా చెప్పాను.
కానీ ఎవరు స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా అండి అంటూ వేడుకుంది. దాదాపు 300 సినిమాలు చేశాను. చిరంజీవితో ప్రభాస్‌తో.. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద హీరోల అందరితో చేసి.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక అవస్థగా ఉన్నాను. నన్ను ఇలానే వదిలేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తారా.. దయచేసి తనకు సాయం చేయండి అంటూ శ్యామల తన ఆవేదన వ్యక్తం చేసింది.